S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

స్వగ్రామానికి వస్తూ తిరిగిరాని లోకాలకు

సుండుపల్లె, జూలై 28: బతుకుదెరువు కోసం కువైట్‌కు వెళ్ళి తిరిగి స్వగ్రామానికి వచ్చే సమయంలో రోడ్డు ప్రమాదంలో మృత్యువు కబళించింది. వివరాలల్లోకి వె ళితే..తిమ్మసముద్రం కస్పాకు చెందిన వెంకటమ్మ గత కొద్ది సంవత్సరాలుగా బతుకుదెరువు కోసం కువైట్‌కు వెళ్ళిం ది. సుమారు ఐదు సంవత్సరాల తరువాత తిరిగి స్వగ్రామానికి వచ్చి తన కుటుంబసభ్యులతో ఆనందంగా గడపాలనే ఉద్దేశ్యంతో ఎంతో సంతోషంగా తన స్వగ్రామమైన సుండుపల్లెకు వస్తున్న క్రమంలో చిత్తూరు-పీలేరు రోడ్డు మార్గంలోని కల్లూరు దామలచెరువు ఘాట్ వద్ద ఆర్టీసీ బస్సు ఆమె ప్రయాణిస్తున్న స్కార్పియో ఢీకొనడంతో వెంకటమ్మ అక్కడికక్కడే మృతిచెందగా, వీరి మేనల్లుడు చంటి మృతురాలి సోదరుడు క్రిష్ణ, అతని భార్య కుమారులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని మృతురాలి మేనల్లుడు ప్రమాద స్థలం నుండి పీలేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం తిరుపతికి తీసుకెళ్లాలని వైద్యులు చెప్పడంతో అక్కడి నుంచి తిరుపతికి తరలించినట్లు వారి కుటుంబసభ్యులు తెలిపారు.