S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వైవియులో పోస్టుల భర్తీ

కడప, జూలై 28:విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న ఆచార్య, సహాచార్య, సహాయకచార్యులు, అధ్యాపకుల భర్తీపై రాష్ట్రప్రభుత్వం తాజాగా గురువారం యోగివేమన విశ్వవిద్యాలయానికి 90 పోస్టులు ఖాళీలు ఉం డగా, 51పోస్టులు మాత్రమే మం జూరుచేసింది. దేశస్థాయిలో 20 ప్రయోగశాలలు విశ్వవిద్యాలయంలో కలిగి ఉండగా సరిపడ అధ్యాపక బృందం లేక మొక్కుబడిగా ప్రయోగాలను నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కేంద్రం లో ప్రతిష్టాత్మకమైన నాక్ బృందం పర్యటించి యోగివేమన విశ్వవిద్యాలయంలో ఉన్న సౌకర్యాలు, విద్యాబోధన, ఇప్పటి వరకు ప్రయోగాలుచేసి దేశస్థాయిలో అన్ని యూనివర్సిటీల్లో యోగవేమన యూనివర్సిటీ స్థానాన్ని సంపాదించుకోగా రాష్ట్రంలో మూడవ స్థానాన్ని సంపాదించుకుంది. అలాగే వైవియుకు గుర్తింపురావడంతో నాక్ బృందం సంతృప్తి వ్యక్తం చేస్తూ యు జిసి యోగివేమనకు నాక్ బి-గ్రేడ్‌ను ప్రకటించింది. నాక్ గుర్తింపు కలిగిన విశ్వవిద్యాలయాలకు గ్రేడ్‌ను బట్టి ప్రత్యేక నిధులు కేటాయింపులో భాగంగా ఈ విశ్వవిద్యాలయానికి రూ.20కోట్లు కేటాయించింది. రూ.20 కోట్లు కేటాయించి ఇప్పటికీ నాలుగుమాసాలైనా ఇంతవరకు నిధులు మంజూరు చేయలేదు. రూటా నిధులకోసం విశ్వవిద్యాలయం ఎదురుచూస్తోంది. ప్రస్తుతం ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, లెక్చరర్ల పోస్టులను రాష్ట్రప్రభుత్వం 2016-17కు గాను 51 పోస్టులు మంజూరుచేయగా, 2017-18కి మరో 9 పోస్టులు మంజూరుచేసింది. అయితే ప్రస్తుతం విశ్వవిద్యాలయంలో ముఖ్య విభాగాలలో 90 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సీమ జిల్లాలకే తలమానికంగా వివిధ ప్రయోగాలు చేసి దేశస్థాయిలోనే గుర్తింపు వచ్చిన వైవియుకు పూర్తిస్థాయిలో పోస్టులు భర్తీగాక పోవడంతో ప్రయోగాల నిర్వహణ జాప్యం జరిగే అవకాశాలున్నాయని విశ్వవిద్యాలయ అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ విశ్వవిద్యాలయంలో రాడార్ కేంద్రం ఏర్పాటుచేసి న్యూక్లియర్ అటానమిక్ ప్రయోగాలు చేయాల్సి ఉండగా ఇంతవరకు మొదలుకాలేదు. శ్రీహరికోటలో ఉన్న బేస్‌కు వివిధరకాల విభాగాల తయారీకి ఈ విశ్వవిద్యాలయానికి కేంద్రం మంజూరు చేసింది. అధ్యాపకుల కొరతతో విడిభాగాలు ఇంతవరకు తయారుచేయలేదు. ఈ విశ్వవిద్యాలయం ప్రారంభించిన ఏడేళ్లకు ముందు ప్రపంచస్థాయిలోనే ఇక్కడి పరిశోధన విద్యార్థులు, అధ్యాపకులు అనేక పరిశోధనలు చేసి ఇతర దేశాలకు వెళ్లి తమ ప్రయోగాలను అక్కడ వివరించి విదేశాల్లో మన్ననలు పొందాయి. అయితే అధ్యాపకుల మంజూరులో ఈవిశ్వవిద్యాలయానికి రాష్ట్రప్రభుత్వం పెద్దపీట వేయలేదు. ఇప్పటికైనా విశ్వవిద్యాలయం పాలకమండలి , అధికారపార్టీనేతలు చొరవ తీసుకుని అధ్యాపకుల పోస్టులను భర్తీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.