S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఇక్రిశాట్ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన

సంబేపల్లె, జూలై 28:ఇక్రిశాట్ (అం తర్జాతీయ ఉష్ణమండల పంటల పరిశోధనా సంస్థ) ఆధ్వర్యంలో మండల పరిధిలోని దేవపట్ల గ్రామం కట్టుగుత్తపల్లె రైతులకు గురువారం ఇక్రిశాట్ సంస్థ అంతర్జాతీయ సీనియర్ శాస్తవ్రేత్తలైన కేశవరావు, గిరీష్‌చందర్‌లు రైతు కోసం కార్యక్రమంలో ఇక్రిశాట్ సంస్థ రైతులకు చేస్తున్న వివిధ పరిశోధనలపై వారికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ శాస్తవ్రేత్త కేశవరావు మాట్లాడుతూ రాష్ట్రంలోని మొత్తం 670 మండలాలలో ఇక్రిశాట్ సంస్థ రైతులకు మేలైన వంగడాలను అందించడానికి కృషి చేస్తోందని ఇందుకుగాను మొదట మట్టి నమూనాలను సేకరించి మట్టిని పరీక్షించి సూక్ష్మ ధాతువుల లోపాలను గుర్తించి ఏ పంటలకు ఏ విధమైన చర్యలు తీసుకుంటే రైతులకు అధిక దిగుబడిని అందించే విధంగా ఉంటుందో అటువంటి చర్యలను వ్యవసాయ శాఖ ఇక్రిశాట్ సంస్థలు సంయుక్తంగా పరిశోధనలు చేసి రైతులకు మేలైన వంగడాలను అందించేందుకు కృషి చేస్తోందన్నారు. అదే విధంగా రైతులు విత్తుకోవడానికి మంచి సమయాన్ని కూడా వారు సూచించారు. సాధారణంగా ఖరీఫ్ సీజన్‌లో రాయచోటి ప్రాంతంలో జూన్ ఆఖరి నుండి వేరుశనగ వత్తడానికి రైతులు సమాయత్తమవుతుంటారు. కాకపోతే జూలై నెలలో మధ్య నుండి ఆఖరి వరకు వేరుశనగ విత్తనాలు విత్తుకుంటే మంచి దిగుబడిని సాధించవచ్చునని తెలిపారు. అంతేకాకుండా వర్షపాతం ఫలానా సమయంలో ఎంత పడాలో తెలియని పరిస్థితులలో రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ ద్వారా వర్షపాతాన్ని నమోదు చేసుకుని రానున్న కాలంలో కూడా ఎంత వర్షపాతం పడుతుందో తెలియజేసే అత్యాధునిక సంస్థల సహకారాన్ని కూడా తాము తీసుకుని రైతులకు సంక్షిప్త సందేశాల ద్వారా చరవాణుల ద్వారా రైతులకు తెలియజేస్తున్నామన్నారు. సాధారణంగా ఏ పంట అయినా ఆ ప్రాంత శీతోష్ణస్థితిని బట్టి వర్షపాతాన్ని బట్టి పంటలు పండించడం జరుగుతుందని, ఇందులో భాగంగా తాము వాతావరణ శాఖలతో పాటు వివిధ దేశాలకు సంబంధించిన వాతావరణ శాఖల సమన్వయంతో వర్షాల లెక్కింపును ఆధారంగా పంటకు కావాల్సిన నీటి యాజమాన్యాన్ని రైతులకు తెలియజేస్తున్నామని తెలిపారు. మండల పరిధిలోని దేవపట్ల, శెట్టిపల్లె, గుట్టపల్లె గ్రామాలలో 220 మంది రైతులు ఇక్రిశాట్ ద్వారా అవగాహన కల్పిస్తున్నామన్నారు. అనంతరం మరో సీనియర్ శాస్తవ్రేత్త గిరీష్‌చందర్ మాట్లాడుతూ భూమిలో కార్బన్ శాతం లోపించడంతో భూమి సత్తువను కోల్పోయి దిగుబడులు ఇవ్వలేని పరిస్థితులు కనపడుతున్నాయని ఇక్రిశాట్ సూక్ష్మధాతువులను రైతులకు అందజేస్తూ భూమిలో బోరాన్, నైట్రోజన్, పొటాషియం తదితర 17 రకాల ధాతువులను పెంపొందించడానికి కృషి చేస్తోందన్నారు. రైతులకు సబ్సిడీలో ఈ ధాతువులను వ్యవసాయ శాఖ ద్వారా అందిస్తోందని తెలిపారు. రైతులు సేంద్రీయ ఎరువులు వాడుతున్నపుడు పశువుల ప్యాడ వంటివి అలాగే వేయకుండా వాటిని డీ కంపోస్టు అయ్యే వరకు ఉంచి పొలాల్లో వేసుకుంటే అధిక దిగుబడిని పొందవచ్చని తెలిపారు. అనంతరం వ్యవసాయాధికారి రమేష్‌బాబురావు మాట్లాడుతూ మండల వ్యాప్తంగా అత్యధిక శాతం వేరుశనగ పంటను సాగు చేస్తున్నారని సాధారణంగా వేరుశనగ పంటకు ఎర్రగొంగళి బారినపడే అవకాశం ఎక్కువగా ఉన్నందున రైతులు తమ వేరుశనగ పొలాలలో జిల్లేడు ఆకులను ఉంచి వాటిని ఆశించిన ఎర్రగొంగళిని తీసుకువచ్చి కాల్చివేయాలని తెలిపారు. అంతేకాకుండా పలు రకాల సూక్ష్మధాతువులను సబ్సిడీ ధరలకే రైతులకు అందిస్తున్నామని తెలిపారు. జిలుగు వంటి పంటలకు సత్తువనిచ్చే రకాలను ఈ యేడు రైతులకు అందించామని తెలిపారు. అనంతరం శాస్తవ్రేత్తల బృందం రైతు క్రిష్ణారెడ్డి పొలంలో సుమారు రూ.52 వేలతో ఏర్పాటు చేసిన రెయిన్‌గేజ్‌ను పరిశీలించారు. గురువారం తెల్లవారుజామున కురిసిన వర్షాన్ని వారు నమోదు చేసుకున్నారు. ఆ ప్రాంతంలో 81 మిమీ వర్షపాతం నమోదైందని వారు తెలిపారు. అనంతరం పంటలపై రైతులు అడిగిన పలు ప్రశ్నలకు వారు సమాధానాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సైంటిఫిక్ అధికారులు పాపిరెడ్డి, హరిక్రిష్ణ, ఎన్‌జీవోలు రామక్రిష్ణ, నరసమ్మ, ఆది, టీడీపీ నాయకులు బయారెడ్డి, రైతులు రామాంజులు, రమణ, క్రిష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.