S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వలసనేతల డీలా!

కడప, జూలై 28:నియోజకవర్గాల పెంపుపై ఆలోచనలేదని ఇప్పట్లో జరగదని గురువారం కేంద్ర హోం మంత్రిత్వశాఖ ప్రకటించడంతో 2019 ఎన్నికల టికెట్లకోసం చాలా మంది సైకిలెక్కడంతో ఆ పార్టీకి తలనొప్పిగా మారనుంది. తెలుగుదేశంపార్టీని నమ్ముకుని ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన నేతలు తమకు రాజకీయ భవిష్యత్, మనుగడ ఉండదని ఢీలా పడ్డారు. జిల్లాలో రెండుపార్లమెంట్ నియోజకవర్గాలు, 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా నియోజకవర్గాల పునర్విభజనతో జనాభా ప్రాతిపదికపై మరో మూడు కానీ నాలుగుకానీ నియోజకవర్గాలు జిల్లాలో పెరుగుతాయని అధికారపార్టీ నేతలు నిన్నటి వరకు సంకలు గుద్దుకున్నారు. ప్రస్తుతం జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో తొలినుంచి తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ పార్టీని నమ్ముకున్న నేతలు ఉండగా 2014 ఎన్నికల ముందు, ఆ తర్వాత కాంగ్రెస్, వైకాపా నుంచి మాజీ ఎంపిలు, మాజీ మ్మెల్యేలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు , పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు పెద్ద ఎత్తున వలసలు వచ్చారు. ప్రస్తుతం అధికారపార్టీ నేతలు, వలసవచ్చిన నేతల మధ్య ఆధిపత్య పోరుతో కార్యకర్తలు నలిగిపోవడంతోపాటు పార్టీకి తలనొప్పిగా మారింది. వలస వచ్చిన నేతల్లో చాలా మంది ఆర్థికపరిపుష్టి కలిగివుండటంతో తెలుగుదేశం పార్టీలోనూ ప్రభుత్వంలోనూ వారి హవా కొనసాగుతోంది. తెలుగుదేశం పార్టీని నమ్ముకున్న అసలైన నేతల మాటలు చెల్లుబాటుకావడం లేదు. ముఖ్యంగా ఎమ్మెల్సీలు, వైకాపా ఎమ్మెల్యేలు టిడిపిలోకి రావడంతో వారు పార్టీలో చేరేముందే 2019 ఎన్నికల నాటికి తమకు పార్టీ టికెట్లు ఇవ్వాలని ఖరారు చేసుకున్న తర్వాతే పార్టీలో చేరారు. రాష్టవ్రిభజన ఎలాగు జరిగిపోయిందని, నియోజకవర్గాలు పునర్విభజన జరుగుతుందని తెలుగుదేశంపార్టీ అధిష్టానం వలస వచ్చిన నేతలందరికీ సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అయితే నియోజకవర్గాలు పెంపు ఇప్పట్లో కుదరదని కేంద్రం తెగేసి చెప్పడంతో వలస వచ్చిన నేతలు తమ రాజకీయ ఉనికికోసం గోడదూకే అవకాశాలు లేకపోలేదు. మరో నాలుగైదు నెలల్లో ఎమ్మెల్సీ స్థానాలు భారీగా ఖాళీ అవుతుండటంతో ఆ ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకరికో ఇద్దరికో జిల్లా తరపున ఎమ్మెల్సీ పదవులు కట్టబెట్టే అవకాశాలు కన్పిస్తున్నాయి. అయినా చాలా మంది నాయకులు అసెంబ్లీ టికెట్ కావాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఇరువురు నుంచి ముగ్గురు పార్టీ టికెట్ ఆశిస్తూ 2019 ఎన్నికలకు సై అంటున్నారు. కేంద్ర హోంమంత్రిత్వశాఖ పునర్విభజనలో ఎమ్మెల్యే స్థానాలు లభించే అవకాశాలు లేవని ప్రకటించింది. ఇదిలా ఉండగా వైకాపా, బిజెపిలు అధికారపార్టీ నుంచి వలసవచ్చిన నేతలకోసం వేచిచూస్తోంది. మొత్తం మీద నియోజకవర్గాల పెంచే ఆలోచన లేదని ప్రకటించడంతో జిల్లాలో అధికారపార్టీ నేతలు ఖంగుతిన్నారు.