S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

చురుగ్గా సాగుతున్న పుష్కర పనులు

అమరావతి, జూలై 28: కృష్ణా పుష్కరాలు ప్రారంభ తేదీ మరో పక్షం రోజులకు రావడంతో అమరావతిలో జరుగుతున్న పుష్కర పనులన్నీ వేగం పుంజుకున్నాయి. అలాగే ఆయాశాఖలు తమ తమ పనులను ముమ్మరం చేశాయి. గ్రామ శివారులోని గుంటూరు, విజయవాడ, సత్తెనపల్లి రోడ్లలో సు మారు 20 వేల మందికి పైగా తాత్కాలిక బస కల్పించేవిధంగా ఏర్పాటుచేస్తున్న పుష్కరనగర్ పనులు ఊపందుకున్నాయి. షెడ్‌ల నిర్మాణం కూడా దాదాపు పూర్తికావచ్చింది. అలాగే విద్యుద్దీకరణ కార్యక్రమాల్లో భాగంగా మెయిన్ బజారులో ఉన్న పూర్వకాలపు స్తంభాలను తొలగించి 11/33 కెవి విద్యుత్‌లైన్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఎడిఎ సత్యనారాయణ తెలిపారు. అంతర్ రహదారుల ఆధునికీకరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. స్నానఘాట్ల వద్ద జరుగుతున్న పనులు కూడా సుమారు 50 శాతం పూర్తికావచ్చాయి. ఈనెలాఖరులోగా అన్ని పనులు పూర్తిచేయాలని ఆయాశాఖలు పనుల్లో నిమగ్నమయ్యాయి.