S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

టైం స్కేల్ ఉద్యోగులకు జీవో 119 అమలు చేయాలి

తాడికొండ, జూలై 28: ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో గత 30 సంవత్సరాలుగా పని చేస్తున్న టైంస్కేల్ ఉద్యోగులకు ఇతర యూనివర్శిటీలలో లాగా జీవో 119 అమలు చేయ్యాలని ఆచార్య ఎన్‌జిరంగా అగ్రికల్చర్ యూనివర్శిటీ ఎంప్లారుూస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కె నిరంజన్‌కుమార్ బుధవారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విశ్వవిద్యాలయం వద్ద ఈనెల 25 నుండి టైంస్కేల్ ఉద్యోగులకు హెచ్‌అర్‌ఎ, లీవుల అమలు, రెగ్యులరైజేషన్ కోరుతూ నిరవధిక సమ్మె చేస్తున్నామని తెలిపారు. టైంస్కేల్ ఉద్యోగులకు జీవో 119 ప్రకారం ఇంటి అద్దె అమలు, 12 క్యాజువల్ లీవు సౌకర్యాలను కల్పించాలని, 2-94 చట్టాన్ని సవరించి వివిధ యూనివర్శిటీలు, ప్రభుత్వశాఖలు సంస్థలలో పనిచేస్తున్న టైంస్కేల్, మినిమమ్ టైంస్కేల్, కంటింజెంట్ తదితర కేడర్ల ఉద్యోగులందర్నీ రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులరైజ్ చెయ్యాలని అడ్మినిస్ట్రేషన్ ఆఫీసు ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ విశ్వవిద్యాలయ టైంస్కే ల్ ఉద్యోగులపై వివక్షతను విడనాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపి మెడికల్ ఎంప్లారుూస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పిపియస్‌యస్ రెడ్డి, కార్యదర్శి కుమార్, హార్టికల్చర్ యూనివర్శిటీ నాన్‌టీచింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు చిన్నారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.