S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

చరిత్రలో నిలిచిపోయేలా కృష్ణా పుష్కరాలు

దాచేపల్లి, జూలై 28 :ప్రతి మనిషి జీవితంలో అరుదుగా వచ్చే పవిత్రమైన కృష్ణా పుష్కరాలను విజయవంతం చేయడంలో మీడియా కీలక పాత్ర వహిస్తుందని గురజాల ఎమ్మేల్యే యరపతినేని శ్రీనివాస రావు అన్నారు. గురువారం మండలంలోని పొందుగల, రామాపురం, తంగెడ, భట్రుపాలెం, కాట్రపాడు పుష్కర ఘాట్లను పరిశీలించిన ఎమ్మేల్యే పొందుగలలో విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. ప్రతి మనిషి జీవితంలో కాలం అత్యంత ముఖ్యమైందని పండుగలు ప్రతి ఏడాది వస్తాయని అయితే పుష్కరాలు మాత్రం 12 సంవత్సరాలకు ఒక సారి మాత్రమే వస్తాయని యరపతినేని చెప్పారు. 12 సంవత్సరాల కాల వ్యవధిలో మనిషి జీవితంలో పలు మార్పుటు చోటు చేసుకుంటాయని చెప్పారు. అరుదుగా వచ్చే పుష్కరాలు లాంటి పవిత్రమైన ఉత్సవాలను విజయవంతం చేసేందుకు అధికారులు, మీడియా, ప్రజాప్రతినిధులు కీలక పాత్ర వహించాలని యరపతినేని పేర్కొన్నారు. గోదావరి పుష్కరాలకు ఏ మాత్రం తీసిపోకుండా అంతకంటే గొప్పగా కృష్ణా పుష్కరాలను నిర్వహించాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. పల్నాడులో మొత్తం 14 పుష్కర ఘాట్లు ఉన్నాయని వాటిలో గురజాల నియోజకవర్గంలో 10 ఉండగా, మాచర్ల నియోజకవర్గంలో 4 ఉన్నాయని ఆయన చెప్పారు. ఈ 14 ఘాట్ల అభివృద్ధికి ప్రభుత్వం 150 కోట్ల రూపాయలు కేటాయించిందని ఆయన తెలిపారు. ప్రధానంగా ఆంధ్ర-తెలంగాణ సరిహద్దులో హైవే పక్కన ఉన్న పొందుగల పుష్కర ఘాట్‌కు ఎక్కువ మంది యాత్రికులు వచ్చే అవకాశం ఉన్నందున ఈ ఘాట్ అభివృద్ధిపై ప్రత్యేక చర్యలు తీసుకొనున్నట్లు ఆయన చెప్పారు. ఆంధ్ర సరిహద్దులో పొందుగల వద్ద భారీ స్థాయిలో కృష్ణా పుష్కరాల స్వాగత ఆర్చీని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అదే విధంగా తిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయ నమునాను ఏర్పరిచి 12 రోజుల పాటు ఆ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. 12 రోజుల పుష్కరాలలో 12 రకాల హారతులు కృష్ణా నదికి ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. పుష్కర యాత్రికుల సౌకర్యార్ధం ప్రత్యేకంగా ఫ్లడ్ లైట్లను ఏర్పాటు చేస్తున్నామని అదే విధంగా మహిళలు బట్టలను మార్చుకునేందుకు ప్రత్యేక గదులు, టాయిలెట్లు ఏర్పాటు చేస్తున్నామని యరపతినేని తెలిపారు. స్నానానికి నదిలోనికి దిగలేని వృద్ధులకు షవర్ బాత్‌లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అదే విధంగా పుష్కరాలలో పాల్గొనే యాత్రికులందరికి భోజన వసతులు కల్పిస్తున్నట్లు చెప్పారు. పుష్కర యాత్రికులకు ప్రత్యేక ఆతిధ్యం ఇచ్చి పల్నాటి ప్రజల ఆదరణను బయట ప్రపంచానికి తెలియచేయాలని యరపతినేని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.