S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఉద్యమస్ఫూర్తితో వనం- మనం

గుంటూరు, జూలై 28: రాష్ట్రప్రభుత్వం పిలుపుమేరకు ఈనెల 29 చేపట్టనున్న వనం-మనం కార్యక్రమాన్ని ఉద్యమస్ఫూర్తితో విజయవంతం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కోరారు. గురువారం బాపట్ల నియోజకవర్గం చుండూరుపల్లి గ్రామంలో 4.25 లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆయన ఎమ్మెల్సీ అన్నం సతీష్‌ప్రభాకర్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి మంత్రి మాట్లాడుతూ మొక్కలు నాటే కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. ఈనెల 29న రాష్టవ్య్రాప్తంగా కోటి మొక్కలను నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించిందన్నారు. గ్రామ స్థాయి నుండి జిల్లాస్థాయి వరకు ప్రా ధాన్యతా క్రమంలో మొక్కలు నాటాలన్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా 4.25 లక్షల మొక్కలను నాటిక ఘనత బాపట్ల నియోజకవర్గానికి దక్కుతుందన్నారు. హరితాంధ్రప్రదేశ్‌లో భాగంగా చేపడుతున్న మొక్కలు నాటే కార్యక్రమంలో రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిపోయేలా ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సహకరించాలని కోరారు. ఎ మ్మెల్సీ సతీష్ ప్రభాకర్ మాట్లాడుతూ బాపట్ల నియోజకవర్గంలోని బాపట్ల మండలంలో లక్షా 25 వేల మొక్కలు, పివిపాలెం మండలంలో 75 వేలు, కర్లపాలెం మండలంలో లక్ష మొక్కలను ఈ రోజు నాటుతున్నామన్నారు. ఈనెల 29న రాష్ట్రప్రభుత్వ పిలుపుమేరకు వనం- మనం కార్యక్రమంలో బాపట్ల పట్టణ పరిధిలోని 34 వార్డుల్లో లక్షా 25 వేల మొక్కలను నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. తెనాలి ఆర్‌డిఒ జి నరసింహం, డ్వామా పిడి పి శ్రీనివాసులు, తహశీల్దార్ వల్లయ్య, ఎండిఒ శివనారాయణ, బాపట్ల సిడిపిఒ గీతాంజలి, సర్పంచ్ ఎం హలెలూయా పాల్గొన్నారు.