S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

విస్తరణ నిర్వాసితులకు అండగా నిలుస్తా:వరుపుల

శంఖవరం, జూలై 28: కత్తిపూడి నుంచి పామర్రు వెళ్లే 214వ జాతీయ రహదారి విస్తరణలో భాగంగా భూములు, గృహాలు కోల్పోయిన నిర్వాసితులు, బాధితులకు న్యాయం జరిగే వరకు అండగా నిలుస్తానని ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు అన్నారు. మండలంలోని కత్తిపూడి గ్రామంలో బాధితుల ఫిర్యాదుతో ఆర్‌అండ్‌బి, హైవే, రెవెన్యూ అధికారులతో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించాల్సి ఉండగా కేవలం జాయింట్ కలెక్టర్-2 రాధాకృష్ణమూర్తి మాత్రమే హాజరయ్యారు. దీనితో ఎమ్మెల్యే వరుపుల ఆర్‌అండ్‌బి, హైవే అధికారుల వైఖరిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సమావేశంలో బాధితులు తమకు జరిగిన అన్యాయంపై సాక్ష్యాధారాలతో జెసి-2 రాధాకృష్ణమూర్తి వద్ద ఏకరవు పెట్టారు. హైవే భూ నిర్వాసితులు 94 మంది ఉండగా, వారి నుంచి శంఖవరం తహసీల్దార్ కార్యాలయంలో పలు దఫాలు అవార్డు విచారణ పేరుతో ఫిర్యాదులు స్వీకరించినా పరిష్కారం కాలేదన్నారు. ఒకే సర్వే నెంబర్‌లోగల భూములను కోల్పోతున్న రైతులకు వేర్వేరుగా ధరలు నిర్ణయించి నష్టపరిహారం అందిస్తున్నారని, ఇది చాలా అన్యాయమన్నారు. ఒకే ప్రాంతంలో తుని ఆర్‌అండ్‌బి అధికారులు 115 గజాలలో ఉన్న శ్లాబ్ భవనానికి రూ.17 లక్షలు నష్టపరిహారం నిర్ణయించగా, దాని ఎదురుగా 95 గజాలలోని పెంకుటిల్లుకు పిఠాపురం ఆర్‌అండ్‌బి అధికారులు 33లక్షలు నష్ట పరిహారంగా నిర్ణయించారన్నారు. దీనిపై డిసిసిబి ఛైర్మన్ వరుపుల రాజా మాట్లాడుతూ బాధితుల నష్టపరిహారం విషయంలో తేడాలను సరిచేసి న్యాయం చేయాలని జెసి-2ను కోరగా ఆయన తనకు ఆ అధికారం లేదని, జిల్లా కలెక్టర్ ఒక్కరే చేయగలరన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పనులు నిలుపుదల చేయాలని వరుపుల కోరారు. అవసరమైతే వారి తరుపున నిరాహార దీక్ష చేపడతానని హెచ్చరించారు. సమావేశంలో టిడిపి సమన్వయకర్త పర్వత రాజబాబు, నాయకులు పర్వత సురేష్, వెన్నా శివ, ఉల్లి వీరభద్రరావు, గౌతు నాగు, సర్పంచ్ సాల్మన్‌రాజు, ఉప సర్పంచ్ గౌతు దొరబాబు, కార్యదర్శి పద్మరాజు పాల్గొన్నారు.