S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అక్రమ క్వారీ సీజ్

గంగవరం, జూలై 28: గంగవరం మండలం జగ్గంపాలెం సమీపంలో పోతన్నదొరపాలెం వద్ద ఏవిధమైన ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా నిర్వహిస్తున్న బ్లాక్‌మెటల్ క్వారీని సీజ్ చేసినట్టు తహసీల్దార్ పినిపే సత్యనారాయణ తెలిపారు. జగ్గంపాలెం సమీపంలో అక్రమ క్వారీ నిర్వహిస్తున్నారని సమాచారం అందడంతో గురువారం మధ్యాహ్నం క్వారీని సందర్శించి క్వారీ నిర్వహణ జరుగుతున్నట్టు గుర్తించామన్నారు. క్వారీ నిర్వహణకు ఏవిధమైన ప్రభుత్వ అనుమతులు లేవన్నారు. క్వారీ వద్ద ఉన్న రెండు పొక్లయినర్లు, మూడు ఎక్స్‌కేవటర్లు, రెండు బాంబు జాకీలు, మూడు మోటరు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. క్వారీ నిర్వహణకు సంబంధం ఉన్న బాధ్యులపై కేసులు నమోదు చేస్తున్నామని ఆయన తెలిపారు. జగ్గంపాలెం గ్రామానికి చెందిన మాజీ ఎంపిటిసి కారం బాపనమ్మతో సహా మరికొంతమందిపై కేసులు నమోదు చేస్తామన్నారు. ఈ అక్రమ క్వారీ నిర్వహణపై సబ్-కలెక్టర్‌కు నివేదిక పంపుతున్నట్టు తహసీల్దార్ తెలిపారు. ఆయన వెంట ఆర్‌ఐ చిరంజీవిబాబు, విఆర్వోలు భూలక్ష్మి, బుల్లబ్బాయి తదితరులున్నారు.