తిరుమలలో కుంభవృష్టి
Published Friday, 29 July 2016తిరుమల, జూలై 28: తిరుమలలో గురువారం సాయంత్రం కుంభవృష్టి పడింది. గంట పాటు ఎడతెరపిలేని వర్షంతో లోతట్టుప్రాంతాలు జలమయమయ్యాయి. భక్తులు ఇబ్బందులు పడ్డారు. గదులు దొరకని భక్తులు మరిన్ని ఇబ్బందులకు గురయ్యారు. దుకాణాలు మూతబడ్డాయి. అయితే వాతావరణం చల్లబడింది.