S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కబేళాలకు తీసుకెళ్తున్న లేగదూడలు టిటిడి గోశాలకు తరలింపు

తిరుపతి, జూలై 28: ఇటీవల పుంగనూరు నుంచి కబేళాలకు తరలిస్తున్న 52 లేగదూడలను బిజెపి నేతలు కాపాడిన విషయం పాఠకులకు విదితమే. అయితే వీటిని పలమనేరు గోశాలకు తరలించారు. అక్కడ సరైన వసతులు లేకపోవడంతో సమాచారం తెలుసుకున్న టిటిడి బోర్డుసభ్యుడు భానుప్రకాష్ రెడ్డి వాటిని తిరుపతిలోని టిటిడి గోశాలకు తరలించారు. డైరెక్టర్ హరినాథరెడ్డితో చర్చించి వాటికి సంరక్షణ కల్పించాలని చర్చించారు. అనంతరం ఆయన లేగదూడలకు స్వయంగా సీసాతో పాలు పట్టించారు. అన్నీ పాలు తాగే వయస్సున్న దూడలు కావడంతో ఎస్వీ గో సంరక్షణ సిబ్బంది కూడా సీసాలతో పాలు పట్టిస్తున్నారు.ఈ సందర్భంగా టిటిడి ధర్మకర్తలమండలి సభ్యుడు జి.్భనుప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ మానవాళికి ఎంతో సేవ చేస్తున్న గోసంపదను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని గుర్తించాలన్నారు. గోవుల రక్షణ బాధ్యత టిటిడిపై ఎక్కువగా ఉందన్నారు. తిరుపతి గో- సంరక్షణ శాల వలే ప్రతి జిల్లా కేంద్రంలోనూ గో సంరక్షణ శాల పనులు నత్తనడకన సాగుతున్నాయని, అక్కడ వసతులు ఉండి ఉంటే ఇంత దూరం ఈ లేగదూడలను తిరుపతికి తీసుకురావాల్సిన అవసరమే వచ్చి ఉండేది కాదన్నారు. పలమనేరులోని టిటిడి గో సంరక్షణ శాల పనులను వేగవంతం చేయాలన్నారు. ఈ అంశంపై వచ్చేనెల 2వ తేదీన జరిగే పాలకమండలి సమావేశంలో చర్చిస్తామని భానుప్రకాష్‌రెడ్డి స్పష్టం చేశారు.