S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఉచిత వైద్యసేవలకు 64 మంది ఎంపిక

తిరుపతి, జూలై 28: దారిద్య్రరేఖకు దిగువున్న ఉన్న పేద రోగులు ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతూ శస్తచ్రికిత్సలు, వైద్యసేవలు పొందలేని వారి కోసం స్విమ్స్‌లో ఉచిత వైద్యసేవలు అందించేందుకు ఏర్పాటుచేసిన ప్రాణదాన కమిటీలో అర్హులైన 64 మంది రోగులను ప్రాణదాన కమిటీ ఎంపిక చేసినట్లు స్విమ్స్‌డైరెక్టర్ డాక్టర్ టి ఎస్ రవికుమార్ తెలిపారు. గురువారం స్విమ్స్‌లో ప్రాణదాన కమిటీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా తెల్లరేషన్‌కార్డులు పొంది ఆర్థిక స్తోమతలేని పేదలు ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న వారిని గుర్తించేందుకు కమిటీ సుమారు 3 గంటల పాటు కసరత్తు చేసింది. ఈ క్రమంలో స్విమ్స్‌లోని నెఫ్రాలజీ, న్యూరాలజీ, అనస్తీషియా, మెడిసన్, సిటీ సర్జరీ, ఆంకాలజీ, గ్యాస్ట్రో ఎంట్రాలజి, న్యూరోసర్జరీలతో పాటు ఇతర ఆసుపత్రులలో ఆయా వ్యాధులతో బాధపడుతున్న వారికి ఉచిత శస్తచ్రికిత్సలుచేయనున్నారు. ఈ కార్యక్రమంలో స్విమ్స్ ఎం ఎస్ ఓ డాక్టర్ వి.సత్యనారాయణ, ఆర్ ఎం ఓ డాక్టర్ గోవిందనారాయణ, టిటిడి సి ఎ ఓ రవిప్రసాద్, సి ఎం ఓ డాక్టర్ వికాస్, బర్డ్ ఆర్ ఎం ఓ మురళీధర్ రావు, రుయా సి ఎస్ ఆర్ ఎం ఓ డాక్టర్ ఆర్ ఆర్‌రెడ్డి, స్విమ్స్ సర్జికల్ ఆంకాలజీ, అడిషినల్ ఫ్రొఫెసర్ డాక్టర్ హెచ్. నరేంద్ర, న్యూరాలజీ డాక్టర్ ఓం ప్రకాష్, మెడికల్ రికార్డ్స్ ఆఫీసర్ డాక్టర్ వివేకానంద్, డాక్టర్ సునీత తదితరులు పాల్గొన్నారు.
ఆరోగ్య వరప్రసాదినికి
రూ.5లక్షలు విరాళం
టిటిడి సహకారంతో స్విమ్స్‌లో ఏర్పాటుచేసిన ఆరోగ్య వరప్రసాదినికి బెంగళూరుకు చెందిన మాధవయ్య రూ. 5లక్షల విరాళాన్ని డిడి రూపంలో గురువారం స్విమ్స్‌డైరెక్టర్ డాక్టర్ టి ఎస్ రవికుమార్‌కు అందజేశారు. ఈసందర్భంగా డాక్టర్ రవికుమార్ మాట్లాడుతూ స్వామిపై అపారమైన భక్తి విశ్వాసాలు, పేదల ఆరోగ్యం పట్ల మానవత్వంతో విరాళమిచ్చిన మాధవయ్య కుటుంబానికి ఆ భగవంతుడి ఆశీస్సులు పరిపూర్ణంగా ఉంటాయాన్నారు. ఈసందర్భంగా దాతకు స్వామివారి చిత్రపటాన్ని ఇచ్చి డాక్టర్ రవికుమార్ సత్కరించారు.