S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వంశీకృష్ణ హత్యకేసును ఛేదించిన పోలీసులు

తిరుపతి, జూలై 28: భవాని నగర్‌కు చెందిన వంశీకృష్ణ గత నెల 12న ఉప్పరపల్లిలో హత్యకు గురయ్యాడు. ముందుగా గుర్తుతెలియని వ్యక్తి హత్యగా నమోదుచేసుకున్న ఎమ్ ఆర్ పల్లి పోలీసులు ఈ కేసును సవాల్‌గా తీసుకున్నారు. గురువారం హత్యకు కారణమైన ఒక పోలీస్ కానిస్టేబుల్ భార్యతో పాటు పలువురిని అరెస్ట్‌చేశారు. జిల్లా ఎస్పీ జయలక్ష్మి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. వంశీకృష్ణ చిన్నచిన్న నేరాలకు పాల్పడుతూ జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో పోలీస్ కానిస్టేబుల్ భార్య లలితకుమారితో పరిచయమైంది. ఈ నేపథ్యంలో ఆమె తన భర్తను వదిలి వంశీకృష్ణతో కొన్ని సంవత్సరాలు సహజీవనం చేసింది. ఈసందర్భంగా వంశీకృష్ణ మరిన్ని దురవ్యసనాలకు అలవాటు పడ్డాడు. ఈక్రమంలో లలితకుమారి వంశీకృష్ణను వదిలి తిరిగి తొలి భర్త వద్దకు చేరింది. అయితే వంశీకృష్ణమాత్రం లలితకుమారి వద్దకు వచ్చి డబ్బులివ్వాలంటూ వేధింపులకు పాల్పడుతూ వచ్చాడు. ఇటీవల లలితకుమారి నివాసం ఉంటున్న శివాలయం వీధికి వచ్చి మీరు వ్యభిచారం చేస్తున్నారంటూ దుర్భాషలాడాడు. ఆమెనే కాకుండా ఆమె వదిన లతపై కూడా అనుచితంగా వ్యవహరించాడు. దీంతో లలితకుమారి, లతలు కూడబలుక్కొని వంశీకృష్ణను హతమార్చడానికి పథక రచన చేశారు. ఇందుకు తమకు తెలిసిన మరో నలుగురు వ్యక్తుల సహాయం తీసుకున్నారు. ఈనెల 12న పెంచులయ్య, సుబ్బులయ్య, సుబ్రహ్మణ్యం, శంకరయ్య తదితరులు వంశీకృష్ణను మద్యం సేవించడానికి మల్లంగుంట వద్దకు తీసుకెళ్లారు. బాగా మద్యం సేవించిన తరువాత ఆరుగురు కలిసి వంశీకృష్ణను కొట్టి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని అక్కడే వదిలి వెళ్లారు. స్థానిక వి ఆర్వో ఇచ్చిన ఫిర్యాదుమేరకు ఎమ్ ఆర్ పలిపోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో లలితకుమారి వంశీకృష్ణ నుంచి విడిపోయినట్లు తేలింది. దీంతో ఆమెను అనుమానించి విచారించడంతో వాస్తవాలు వెలుగుచూశాయి. గమనించదగ్గ విషయం ఏమింటంటే వంశీకృష్ణ అంత్యక్రియల్లో లలితకుమారి, లతలు కూడా పాల్గొన్నారు. కేసు మిస్టరీని చేధించిన పోలీస్ అధికారులను ఎస్పీ అభినందించారు.