S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నిఘా నీడలో ఎఒబి!

గూడెంకొత్తవీధి, జూలై 28: ఆంధ్రా- ఒడిశా సరిహద్దు ప్రాంత పోలీసు నిఘా నీడలో ఉంది. అమర వీరుల వారోత్సవాల నేపథ్యంలో రాష్ట్రం పోలీస్ యంత్రాంగం ఎఒబిలో భద్రతను కట్టుదిట్టం చేసింది. గత కొంత కాలంగా తూర్పు కనుమల్లో మావోయిస్టులకు తగిలిన ఎదురుదెబ్బల్లో అనేక మంది దళ నాయకులు, దళ సభ్యులను కోల్పోయారు. ఈ నేపథ్యంలో అమర వీరుల వారోత్సవాల్లో ఘన నివాళ్ళులర్పించేందుకు వారోత్సవాల ప్రారంభానికి ముందే పలు ప్రాంతాల్లో స్థూపాలను నిర్మించి నివాళ్ళులర్పించారు. ఈ సంఘటనలను దృష్టిలో ఉంచుకుని పోలీస్ యంత్రాంగం వారోత్సవాలను అడ్డుకునే ప్రయత్నంలో నిమగ్నమైంది. దీనిలో భాగంగానే రాష్ట్ర స్థాయి అధికారులు ఈ ప్రాంతంలో పర్యటించి పోలీసులకు పలు సూచనలు చేసిన విషయం తెలిసిందే. మావోయిస్టుల కదలికలు తగ్గాయని అనుకున్న సమయంలో ఒక్కసారిగా మావోయిస్టులు తమ కార్యక్రమాలను విస్తృత పరుస్తుండడంతో వాటిని అడ్డుకోవాలని పక్కా వ్యూహాన్ని రచిస్తున్నారు. అటు సరిహద్దు ప్రాంతం మొత్తం ఖాకీల బూట్ల చప్పుళ్ళతో మారుమ్రోగుతుంది. ఎక్కడ చూసినా పోలీసు బలగాలు మోహరించి తనిఖీలు నిర్వహించడం, మావోల హిట్ లిస్టులో ఉన్నవారిని బయట ప్రదేశాలకు పంపండం వంటి కార్యక్రమాలు పోలీసులు విస్తృత పరుస్తున్నారు. మొదటి రోజు మావోయిస్టుల వారోత్సవాలు ప్రశాంతంగా ముగిసాయి. మరో ఆరు రోజులు జరుగనున్న వారోత్సవాల్లో కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటలు జరుగకుండా పోలీసు యంత్రాంగం సన్నద్ధమైంది. ఈసమయంలోనే ఆంధ్రా- ఒడిశా సరిహద్దు ప్రాంతం పోలీసు నిఘా నీడలో ఉంది.