S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మహిళా మావోయిస్టు లొంగుబాటు

సీలేరు,జూలై 28: ఎ.ఓ.బి. పరిధిలోని కలిమెల ఏరియా కమిటీకి చెందిన రాధా మడకామి అలియాస్ రాధ గురువారం మల్కన్‌గిరి ఎస్పీ మిత్రభాను మహోపాత్రో ఎదుట లొంగిపోయింది. ఈమెపై నాలుగు లక్షల రికార్డు కూడా ఉంది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఛత్తీస్‌గడ్ రాష్ట్రానికి చెందిన సుకుమజిల్లా కృష్టారం పోలీస్ స్టేషన్ పరిధిలోని తోటాపెండువాళ్ గ్రామానికి చెందిన రాధా మడకామి 2002లో కలిమెల ఏరియా కమిటీలో సభ్యురాలిగా చేరింది. ఒడిశాలో గల ఆర్. ఉదయగిరి పోలీస్ స్టేషన్‌లో 2006లో దాడి ఘటనలో పాల్గొంది. అలాగే 2008లో ఎన్.వి. 1,26 మైన్‌ఫ్రూప్ వాహనాన్ని కాల్చివేత ఘటనలో ఆమె పాల్గొంది. 2009లో దామన్‌జోడి అల్యూమినియం కర్మాగారంలో టిఐఎఫ్‌ఎఫ్ జవాన్లపై దాడి ఘటనలో పాల్గొని ఆయుధాలు పట్టుకువెళ్ళడంలో ప్రధాన పాత్ర పోషించింది. ఈమె నైపుణ్యానికి మావోయిస్టు పార్టీ ఏరియా కమిటీ సభ్యురాలిగా బాధ్యతలు అప్పగించారు. 2005లో ఛత్తీస్‌ఘడ్‌లో కాంగ్రెస్ నాయకులపై దాడి చేసిన ఘటన, 2007లో లైనీగూడ, తాటిమట్ట ,2010లో కొండపల్లి, బుజ్జిలంక, 2012లో జెనీగూడ, 2015లో తండికి, 2016లో పట్టిఘాటీ ఎదురుకాల్పుల్లో రాధామడకామి పాల్గొన్నట్లు ఎస్పీ తెలిపారు. ఆంధ్రా - ఒడిశా సెంట్రల్ జోనల్ కమిటీలో 2002 నుండి 2016వరకు కలిమెల ఏరియా కమిటీలో రాధ బహుముఖ పాత్ర పోషించిందని ఎస్పీ మిత్రభాను మహోపాత్రో తెలిపారు. స్వచ్ఛందంగా లొంగిపోయిన రాధా మడకామిపై ఎటువంటి కేసులు పెట్టకుండా ప్రభుత్వం నుండి రివార్డు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.