S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వనం-మనం విజయవంతానికి రంగం సిద్ధం

విశాఖపట్నం, జూలై 28: మిషన్ హరితాంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా వనం-మనం కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టు కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. 67వ వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 29వ తేదీన రాష్టవ్య్రాప్తంగా కోటి మొక్కలు నాటాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ప్రతి జిల్లాలో పది లక్షల మొక్కలు నాటాలని ఆదేశాలు జారీ చేసిందన్నారు. అయితే విశాఖ జిల్లాలో ప్రస్తుతం ఉన్న 42 శాతం పచ్చదనాన్ని 50 శాతానికి పెంచాలనే లక్ష్యంతో 20 లక్షల మొక్కలు నాటేందుకు నిర్ణయించినట్టు చెప్పారు. ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని కేవలం ఒక్క రోజుతోనే సరిపెట్టకుండా ఏడాది పొడుగునా నాటేందుకు ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. అందుకు 20 లక్షల గుంతలు, ఏడాది వయస్సు గల ఆరు అడుగుల ఎత్తు గల మొక్కలు, వాటికి రక్షణగా సేప్ గార్డులను సిద్ధం చేశామన్నారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించే బాధ్యతను ఒక్కొక్కరికి అప్పగిస్తున్నామని, మూడేళ్ళపాటు వాటి సంరక్షణకు అయ్యే ఖర్చులను మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీపథకం నిధుల నుండి మంజూరు చేస్తున్నట్ట ఆయన తెలిపారు. అలాగే ప్రతి మొక్కను కూడా జియోట్యాంగ్ చేస్తూ వాటి సర్వైవల్ రేటును ఎప్పటికపుడు ఆన్‌లైన్‌లో మానిటరింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.
కంబాలకొండలో ప్రారంభం
శుక్రవారం నిర్వహించనున్న వనం-మనం కార్యక్రమాన్ని జిల్లాలో భారీ స్థాయిలో ప్రారంభించేందుకు కంబాలకొండ పర్యావరణ పార్కులో అన్ని ఏర్పాట్లు చేసినట్టు కలెక్టర్ తెలిపారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి తరపున రాష్ట్ర ఎక్సైజ్‌శాఖామంత్రి కొల్లు రవీంద్ర ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారన్నారు. అలాగే స్థానిక మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావులు ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశాలున్నాయన్నారు. వీరితోపాటు జిల్లాలోని పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, ఇతర ప్రముఖులు దీనికి హాజరవుతున్నారన్నారు. పలు పాఠశాలలకు చెందిన సుమారు పలు పాఠశాలలకు చెందిన సుమారు మూడు వేల మంది విద్యార్ధులు, పలు స్వచ్ఛంధ సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల ప్రతినిధులతో పాటు పలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల అధికారులు పెద్దఎత్తున ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారన్నారు. జిల్లాలోని ప్రజలు కూడా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వనం-మనం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 20 లక్షల మొక్కలు నాటేందుకు చర్యలు చేపట్టామన్నారు. సమాజానికి అత్యంత మేలు చేసే పలు రకాల మొక్కలు నాటేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఎవెన్యూ ప్లాంటేషన్‌లో భాగంగా తెల్లమద్ది, పచ్చతురాయి, దేవకాంచనం, రెల్ల, సబూబియా, కదంబ, వేప, జీడిమామిడి, సరుగుడు, యాకలిప్టస్, మామిడి, సపోటా తదితర మొక్కలను నాటుతున్నట్టు ఆయన తెలిపారు. అటవీ ప్రాంతంలో నేరేడు, బండారు, రోజ్‌వుడ్, మద్ది, ఏగిస, తెల్లమద్ది తదితర మొక్కలను అటవీశాఖ నాటుతున్నట్టు ఆయన తెలిపారు. నీడనిచ్చే మొక్కలను డ్వామ, మామిడి, సపోటా, కొబ్బరి వంటి మొక్కలను ఉద్యానవనశాఖ, సిల్వర్‌ఓక్, కాఫీ మొక్కలను ఐటిడిఏ, నీడనిచ్చే మొక్కలతోపాటు పలు రకాల పుష్పజాతి మొక్కలు, బాదం, పొగడ, పచ్చతురాయి తదితర మొక్కలను పలు రకాల పరిశ్రమలు నాటుతున్నట్టు కలెక్టర్ తెలిపారు. లక్ష్యంగా నిర్ధేశించుకున్న 20 లక్షల మొక్కల్లో జివిఎంసి 1.78 లక్షలు, వుడా 1.5 లక్షలు, డ్వామా 4.70 లక్షలు, అటవీశాఖ 7.5లక్షలు, ఉద్యానవనశాఖ 31వేలు, సింహాచలం దేవస్థానం నాలుగు వేలు, ఆంధ్రవిశ్వవిద్యాలయం మూడు వేలు, పలు పరిశ్రమలు రెండు లక్షలు, యలమంచిలి, నర్సీపట్నం మునిసిపాలిటీలు మరో 22వేల మొక్కలను నాటుతున్నట్టు ఆయన తెలిపారు. సామాజిక అటవీశాఖ అధికారి సూర్యనారాయణ పడాల్ ఈ వనం-మనం కార్యక్రమానికి నోడల్ అధికారిగా వ్యవహరిస్తున్నట్టు పేర్కొన్నారు.