S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సింహాచలం భూముల సమస్య పరిష్కారానికి చర్యలు

విశాఖపట్నం, జూలై 28: సింహాచలం భూముల సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింహాచలం దేవస్థానం భూముల వ్యవహారం కోర్టులో ఉందని, అయినప్పటికీ దేవాదాయ శాఖకు, ప్రజలకు నష్టం జరగకుండా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంలో ప్రభుత్వానికి నష్టం జరిగినా భరించేందుకు సిద్ధమన్నారు. చాలా సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న గాజువాక భూముల వివాదాన్ని పరిష్కరిస్తూ జీవో జారీ చేశామన్నారు. స్థలం రిజిస్ట్రేషన్ చేసేందుకు వీలు ఏర్పడిందన్నారు. తొలివిడతగా త్వరలో 10 వేల మందికి ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇందుకు సంబంధించిన పత్రాలను అందచేసేందుకు నిర్ణయించామన్నారు. నగరంలోని భూ ఆక్రమణలకు సంబంధించి 100 చదరపు గజాల కన్నా ఎక్కువ స్థలాల క్రమబద్దీకరణకు ప్రతిపాదించిన ధర ఎక్కువగా ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోందన్నారు. పేదల మీద ఆర్థిక భారం మోపమని తెలిపారు. దీనిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామన్నారు. జివిఎంసి ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహంపై ప్రాథమికంగా చర్చించామన్నారు. ఎన్నికల నిర్వహణ సమయం గురించి సమాధానం దాటవేశారు. ఎన్నికల సమయంలో పొత్తుల గురించి ఆలోచిస్తామన్నారు. పార్టీలో చేరేందుకు వస్తున్న వారిని ఆహ్వానిస్తున్నామని, పార్టీ స్థిరీకరణ అవసరమన్నారు. ప్రతి 15 రోజులకు ఒక సారి పార్టీ నేతలు సమావేశమై రాజకీయ, సంక్షేమ కార్యక్రమాలపై చర్చిస్తారన్నారు. అధికారులతో కూడా సమావేశం నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలు చేరుతున్నాయా? లేదా? దాని ప్రభావం వంటివి తెలుసుకునేందుకు వీలు అవుతుందన్నారు. పార్టీ కార్యకర్తలకు నామినేటెట్ పోస్టుల భర్తీ విషయాన్ని ప్రస్తావించగా, ముఖ్యమంత్రి ప్రకటించారని, ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ సమావేశంలో మంత్రులు కొల్లు రవీంద్ర, గంటా శ్రీనివాసరావు, అయ్యన్న పాత్రుడు, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు, ఎమ్మెల్సీ ఎంవివిఎస్ మూర్తి, జడ్పీ చైర్‌పర్సన్ లాలం భవానీ తదితరులు పాల్గొన్నారు.