S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఈ-పాస్‌తో ఇబ్బందులు

శ్రీకాకుళం, జూలై 28: పారదర్శకంగా ప్రభుత్వం పాలన సాగిస్తున్న ఈ పాస్ పుస్తకాల వలన రైతులు తీవ్ర ఇబ్బందులకు గురిఅవుతున్నారని క్రయ విక్రయాలు పూర్తిగా స్తంభించిపోయాయని పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు గురువారం రెండో రోజు సమీక్షలో ఏకరువు పెట్టుకున్నారు. నగరంలోని ఓ స్టార్ హోటల్‌లో జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి సునీత, కార్మిక శాఖామంత్రి అచ్చెన్నాయుడుతోపాటు పలువురు పరిశీలకులు నిర్వహించిన సమీక్షలో తమ్ముళ్లు గ్రామస్థాయి ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. ఈ పాస్ పుస్తకాలతో రిజిస్ట్రేషన్లు జరపడం లేదని ఎందుకని ప్రశ్నిస్తే.. టైటిల్ డీడ్ తప్పనిసరని తప్పించుకుంటున్నారని అనేక మంది నేతలు ఈ ప్రక్రియలో మార్పులు తీసుకురావాలని ఫిర్యాదు చేశారు. అలాగే మీ ఇంటికి మీ భూమి వైబ్‌సైట్ ఆరంభించినప్పటికీ ముటీషన్ ప్రక్రియ వేగవంతం కాకపోవడంతో బ్యాంకులు అందించే పంట రుణాలు పూర్తిస్థాయిలో రైతులు అందుకోలేకపోతున్నారని పలువురు నేతలు మంత్రుల దృష్టికి తీసుకువచ్చారు. ఇటువంటి ప్రక్రియలో సడలింపులు తీసుకురాకుంటే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందన్న విషయాన్ని గమనించాలన్నారు. బడుగు, బలహీన వర్గాలకు హౌసింగ్ అమలు చేయలేకపోయామని యూనిట్ విలువ 2.70 లక్షలు రూ.లు నిర్ణయించడమే కాకుండా 20-20 కొలతల్లో తాజాగా నిర్మించాలని నిబంధన సడలించకుంటే ఈ పథకం వలన ప్రభుత్వానికి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతా యన్నారు.
రేషన్‌కు తప్పని ఇక్కట్లు
రేషన్ డిపోల నుంచి నెలవారీ సరుకులు బయో మెట్రిక్ ద్వారా అందించడం ద్వారా డీలర్లు రాత్రివేళల్లో సరుకులు పంపిణీ చేసి ప్రజలకు ఇబ్బందులకు గురిచేస్తున్నారని, అంతేకాకుండా వేలిముద్రలు పడలేదని ఆధార్ లింకేజి కావడం లేదని ప్రభుత్వంపై వ్యతిరేకత కలిగేలా వ్యవహరిస్తున్నారని విన్నవించుకున్నారు. ఈ విషయంపై మంత్రి పరిటాల సునీత వివరణ ఇస్తూ ఇప్పటికే సాంకేతికపరమైన ఇబ్బందులను తొలగించేందుకు కొత్త సాఫ్ట్‌వేర్‌ను రూపొందించామని, డీలర్లు అక్రమాలు అరికట్టేందుకు విజిలెన్స్ అధికారులతో తనిఖీలు జరిపించి తప్పుజరిగిన నివేదకల ప్రాప్తికి అటువంటి వారికి తొలగిస్తున్నామని సర్ధిచెప్పారు.
నీరు చెట్టు పనులకు సంబంధించిన బిల్లులు చెల్లింపులకు టిన్ నెంబర్ లింకు పెట్టడంతో ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నాయని కొంతమంది నేతలు సమీక్షలో ప్రస్తావించారు. ఐదు లక్షల రూపాయల బిల్లు చెల్లింపులకు కూడా టిన్ నెంబర్ మెలికి అధికారులు పెడుతున్నారని దీనిని పది లక్షలకు పెంచాలని పలువురు ఫిర్యాదు చేశారు. మంత్రి పరిటాల సునీత బదులిస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి టిన్ నెంబర్ సమస్య తలెత్తకుండా బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నరసన్నపేట నియోజకవర్గం సమీక్షలో పలువురు తమ్ముళ్లు పాత, కొత్త కేడర్ మధ్య అంతరాలు ఉన్నాయని వీటిని తొలగించకుంటే పార్టీ బలహీనపడుతుందని అక్కడ నేతలు వివరించారు. దీనిపై మంత్రి అచ్చెన్నాయుడు జోక్యం చేసుకుని నియోజకవర్గం సమన్వయ కమిటీలో పూర్తిస్థాయి చర్చ జరిపి గ్రామాల వారీగా నాయకులను భాగస్వాములు చేస్తే భవిష్యత్‌లో సమస్యలు ఉత్పన్నం కావన్నారు. పలాస నియోజకవర్గం సమీక్షలో పలు గ్రామాలకు తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేరువ కాకుండా అక్కడ వైసిపి ప్రజాప్రతినిధులు అడ్డుకుంటున్నారని ఫిర్యాదు చేశారు. ఇటువంటి గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ కేడర్‌కు తీర్మానంతో సంబంధం లేకుండా పనులు అప్పగిస్తే పార్టీ మరింత బలోపేతం అవుతుందని సూచించారు. ఈ సమీక్షలో జిల్లా పార్టీ అధ్యక్షురాలు శిరీష, ప్రభుత్వ విప్ కూన రవికుమార్, ఎమ్మెల్యేలు గౌతు శ్యామసుందర శివాజీ, బగ్గు రమణమూర్తి, బెందాళం ఆశోక్, జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి బోయిన గోవిందరావు ఉన్నారు.