S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

జెసి వివేక్ సేవలు ప్రశంసనీయం

శ్రీకాకుళం(రూరల్), జూలై 28: జాయింట్ కలెక్టర్ వివేక్‌యాదవ్ జిల్లాకు అందించిన సేవలు ప్రశంసనీయమని రాష్ట్ర కార్మిక శాఖామంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. గురువారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో రెవెన్యూ అసోసియేషన్ ఏర్పాటున చేసిన అభినందన వీడ్కోలు కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వివేక్‌యాదవ్ జెసిగా తన బాధ్యతలను చేపట్టి ఏడాదిన్నర కాలంలో ఎన్నో వినూత్నమైన మార్పులు తీసుకువచ్చారన్నారు. ముఖ్యంగా పౌరసరఫరాల శాఖలో ఈ పాస్ విధానం అమలు, వంశధార, కొవ్వాడ, తోటపల్లి ప్రాజెక్టుల భూసేకరణలో ప్రత్యేక దృష్టిని సారించి మంచి పేరుతెచ్చుకున్నారన్నారు. విజయనగరం కలెక్టర్‌గా బదిలీపై వెళ్తున్న వివేక్‌యాదవ్ ఆ జిల్లాలో కూడా మంచి పేరు ప్రఖ్యాతలు సాధించాలని మంత్రి ఆకాంక్షించారు. అనంతరం జెసిని అభినందిస్తూ దుస్సాలువాతో మంత్రి సన్మానించారు. ఈకార్యక్రమంలో ఎమ్మెల్సీ కె.ప్రతిభాభారతీ, కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం, జెసి-2 పి.రజనీకాంతారావు, డిఆర్‌వో బి.కృష్ణ్భారతీ, ఐటిడిఏ పివో జె.వెంకటరావు, డిఆర్‌డిఏ పిడి ఎస్.తనూజారాణి, మెప్మా పిడి త్రినాధరావు, జెడ్పి సిఇవో బి.నగేష్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.