S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పేదోళ్ళకు పక్కా గృహాలు!

శ్రీకాకుళం, జూలై 28: రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ పక్కా గృహాలు కట్టించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కిమిడి మృణాళిని తెలిపారు. ఎన్టీఆర్ ప్రత్యేక గృహ నిర్మాణ పథకంలో భాగంగా గురువారం ఆమదావలస మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మాపురంలో తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో 512 గృహాలను నిర్మించేందుకు ఆమె శంకుస్థాపన చేసారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2029 నాటికి రాష్టమ్రంతటా అర్హులైన పేదలందరికీ పక్కా గృహాలు ప్రభుత్వం నిర్మించి ఇస్తుందన్నారు. విభజన అనంతరం ఆర్థికలోటు ప్రభుత్వానికి ఉన్నప్పటికీ, లక్షల కోట్ల రూపాయలతో పేదోళ్లకు గూడు కల్పించాలన్న సిఎం కార్యదీక్ష వల్లే ప్రతీ నియోజకవర్గంలో ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకం పనులు ప్రారంభం అవుతున్నాయన్నారు. ఒక్కోక్క గృహానికి 1.78 లక్షల రూపాయలు సబ్సిడీని ఇస్తుందని స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కూన రవికుమార్ వివరించారు. స్వచ్ఛ్భారత్ కింద 12 వేలు, మరో పది వేల రూపాయలు లబ్ధిదారులు చెల్లించాల్సివుందని తెలిపారు. మిగిలిన మొత్తాన్ని హుదూద్ నిధుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. కోటి రూపాయలతో తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధిలో 117 చెరువులు, 18 కోనేరులు ఉన్నాయని, వీటిద్వారా 105 చెరువుల అభివృద్ధికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు.