S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

జిల్లాలో ప్రజాసాధికార సర్వే వేగవంతం చేయాలి

ఒంగోలు, జూలై 28: జిల్లాలో ప్రజాసాధికార సర్వేను వేగవంతం చేయాలని రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ, జిల్లా ప్రజాసాధికార సర్వే ప్రత్యేక అధికారి కరికాలవళవన్ అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక ప్రకాశం భవనం వీడియో కాన్ఫ్‌రెన్స్ హాలులో ప్రజాసాధికార సర్వే కార్యక్రమ నిర్వహణ గురించి జిల్లా అధికారులతో కరికాల వళవన్ సమీక్షించారు. ఈ సందర్భంగా కరికాల వళవన్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాసాధికార సర్వే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. ప్రజాసాధికార సర్వే వలన ప్రజలకు సులభతరంగా సంక్షేమ కార్యక్రమాలు అమలుచేయాలనే ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ప్రజాసాధికార సర్వే కార్యక్రమంలో అధికారులు చురుకుగా పాల్గొని పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజాసాధికార సర్వే కార్యక్రమానికి అవసరమైన ట్యాబ్‌లు, ఐరిష్ మిషన్‌లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. కొన్ని ప్రాంతాలలో సర్వే సమస్య కారణంగా ప్రజాసాధికార సర్వే ఆలస్యం అవుతుందని అధికారులు తెలిపారు. సర్వేలో లోపాలు తలెత్తకుండా అదనంగా ట్యాబ్‌లు, ఐరిష్ మిషన్‌లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సుజాత శర్మ మాట్లాడుతూ జిల్లాలో ప్రజాసాధికార సర్వేలో అధికారులు చురుకుగా పాల్గొంటున్నారన్నారు. జిల్లాలో 33 లక్షల మంది ప్రజలు ఉన్నారని, ఇప్పటి వరకు 1.35 లక్షల ఇళ్ల వివరాలు ప్రజాసాధికార సర్వే ద్వారా సేకరించడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ఐ ప్రకాష్‌కుమార్, డిఆర్‌డిఏ పిడి ఎంఎస్ మురళి, డ్వామా పిడి ఎన్ పోలప్ప, జడ్పి సిఇఓ టి బాపిరెడ్డి, స్టెప్ సిఇఓ బి రవి, ఒంగోలు, కందుకూరు రెవెన్యూ డివిజనల్ అధికారులు కె శ్రీనివాసరావు, మల్లికార్జున, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, తహశీల్దార్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.