S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వివాహిత ఆత్మహత్య

జరుగుమల్లి, జూలై 28 : ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని కె బిట్రగుంట ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నెల్లూరు జిల్లాకు చెందిన షేక్ సుభాని అదే జిల్లాకు చెందిన కరిమున్నీషాతో గత నాలుగేళ్ల క్రితం పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. బతుకుతెరువు కోసం సుభాని తన భార్యతో కలిసి జరుగుమల్లి మండలం కె బిట్రగుంట గ్రామంలో బిఎస్‌సిపిఎల్‌పి కంపెనీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తూ అదే గ్రామంలో నివాసం ఉంటున్నారు. రోజూ మాదిరిగానే డ్యూటీకి వెళ్లి విధులు పూర్తి చేసుకొని మంచినీళ్ల క్యాన్ తీసుకొని ఇంటికి వచ్చేసరికి ఇంటి తలుపులు గడియవేసి ఉండటాన్ని గమనించాడు. కంగారుతో వెనుక వైపు తలుపు పగులగొట్టి చూస్తే భార్య కరిమున్నీషా (24) చీరతో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని వేలాడుతోంది. వేలాడుతున్న కరిమున్నీషా మృతదేహాన్ని కిందకు దించి మంచం మీద వాల్చినట్లు పోలీసులకు సుభాని తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న మృతురాలి బంధువులు కంగారుతో కె బిట్రగుంట గ్రామానికి చేరుకున్నారు. పోలీసులకు మృతురాలి బంధువులు ఫిర్యాదు చేశారు. రంజాన్ పండుగకు కూడా భార్యాభర్తలు కలిసి నెల్లూరుకు వచ్చినట్లు బంధువులు తెలిపారు. ఏమి జరిగిందో ఏమోనంటూ మృతురాలి బంధువులు రోదిస్తున్నారు. కరిమున్నీసాకు పిల్లలు పుట్టలేదనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుందని మృతురాలి భర్త సుభాని పోలీసులకు వివరించాడు. సంఘటనా స్థలానికి జరుగుమల్లి ఎస్‌ఐ జి రామకోటయ్య చేరుకొని విచారించారు. మృతురాలి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. శుక్రవారం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహం కందుకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.