S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

చోరీకి పాల్పడింది పెంపుడు కొడుకే!

కందుకూరు, జూలై 28 : గుడ్లూరు మండలం తెట్టు గ్రామంలో ఇటీవల జరిగిన దొంగతనం కేసును స్థానిక పోలీసులు గురువారం ఛేదించారు. గురువారం స్థానిక డిఎస్పీ కార్యాలయంలో విలేఖర్ల సమావేశం నిర్వహించిన డిఎస్పీ కె ప్రకాష్‌రావు కేసు వివరాలు వెల్లడించారు. డిఎస్పీ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఈ నెల 23వ తేదీన రాత్రి తెట్టు గ్రామంలోని షేక్ వౌలాలి ఇంట్లో దాచిన 2.50 లక్షల నగదును దుండగులు దొంగలించారని ఈ నెల 24న ఉదయం గుడ్లూరు పోలీస్‌స్టేషన్‌లో వౌలాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. వౌలాలి దంపతులకు సంతానం లేకపోవడంతో ఎస్‌కె సుల్తాన్‌షరీఫ్ అనే అబ్బాయిని అల్లారుముద్దుగా పెంచుకున్నారని డిఎస్పీ తెలిపారు. షరీఫ్ దురలవాట్లకు బానిసై తల్లిదండ్రులకు తెలియకుండా వారు కూలీ చేసి ఇంట్లో పొదుపుచేసి దాచుకున్న 2.50 లక్షలు దొంగతనం చేశాడని తెలిపారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియకుండా ఇంట్లో బీరువాలోని బట్టలను చెల్లాచెదురుగా పడవేసి ఇంట్లో దొంగలు పడినట్లుగా చిత్రీకరించి మిద్దెపై నిద్రించినట్లుగా నటించాడని తెలిపారు. ఈ కేసు విషయంలో విచారణ చేపట్టగా పెంచుకున్న కొడుకే ప్రధాన సూత్రధారిగా తేలిందని డిఎస్పీ తెలిపారు. గురువారం షరీఫ్‌ను అరెస్ట్ చేసి అతని వద్ద ఉన్న 2 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. డిఎస్పీ విలేఖరులతో మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లల నడవడికపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిఐ ఎం లక్ష్మణ్, గుడ్లూరు ఎస్‌ఐ విజయ్‌చందర్, కందుకూరు ట్రైనింగ్ ఎస్‌ఐ రామకృష్ణ, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.