S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి

రాయదుర్గం, జూలై 28 : నియోజకవర్గం అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే, చీఫ్‌విప్ కాలవ శ్రీనివాసులు అన్నారు. ఎమ్మెలేగా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం పట్టణంలో ఏర్పాటు చేసిన విలేఖరు సమావేశంలో అభివృద్ధి కరదీపికను ఓ ఓటర్‌తో విడుదల చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రెండు సంవత్సరాలు ఒక్కో ఏడాది రూ.వంద కోట్ల చొప్పున నిధులు విడుదల చేయించినట్లు తెలిపారు. అయితే నిర్మాణాత్మకమైన అభివృద్ధి పనులే కాకుండా ఏళ్ల తరబడి ప్రజలను వేధిస్తున్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా కులమతాల రహితంగా అభివృద్ధికి పాటుపడుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే మొక్కల పెంపకం, బాలికల విద్య, జలసంరక్షణ వంటి కార్యక్రమాలు విజయవంతంగా చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకు కళ్యాణదుర్గం ఆర్డీఓ రామారావు, తహశీల్దార్ ఖత్రిజన్ కుఫ్రాతోపాటు అధికారులు తమకు చిత్తశుద్ధితో సంపూర్ణ సహకారం అందిస్తున్నారన్నారు. అలాగే దశలవారీగా వేదావతి నదికి పునరుజ్జీవం, బిటిపి రిజర్వాయర్‌కు సాగునీరు లాంటి కార్యక్రమాలు కూడా చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ రాజశేఖర్, జడ్పీటీసీలు పూల నాగరాజు విజయకుమార్, అప్పాజీ పాల్గొన్నారు.