S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

జిల్లావాసులకు మెరుగైన వైద్యసేవలు

అనంతపురం సిటీ, జూలై 28: జిల్లా వాసులకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించేందుకే తెలుగుదేశం ప్రభుత్వం సూపర్ స్పెషాలిటీ ఆసుప్రతి నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని అనంత అర్బన్ ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి తెలిపారు. గురువారం నగరంలోని జెఎన్‌టియూ వద్దనున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ స్థలాన్ని ఎమ్మెల్యే, అధికారులు పరిశీలించారు. ఆసుపత్రి నిర్మాణ పనులను, వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ రాష్ట్రంలో ఏ జిల్లాలోను లేని విధంగా అ నంతలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ని ర్మాణం కాబోతోందన్నారు. గతంలో జిల్లావాసులకు మెరుగైన వైద్యం కావాలంటే పక్క రా ష్ట్రాలకు వెళ్ళాల్సి వచ్చేదని అయితే భవిష్యత్తులో ఆ అవసరం రాదన్నారు. జిల్లా కేంద్రం లో అధునాతనంగా నిర్మాణం కాబోతున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో కార్పొరేట్ ఆసుపత్రి తరహా వైద్య సేవలు ఉచితంగా ప్రజలకు అందుతాయన్నారు. 2014లో టిడిపి అధికారంలోకి వచ్చాక జిల్లా సర్వజన ఆసుపత్రిలో కూడా పెనుమార్పులు తీసుకువచ్చామన్నారు. జిల్లా నలుమూలల నుండి వచ్చే ప్రజల పట్ల ప్రత్యేక శ్రద్ధవహించామన్నారు. జిల్లాలోని ఏ ప్రాంతం నుండి వచ్చి నా మెరుగైన వైద్యం కల్పించేలా నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రతి పేదవాడికి ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా అందించాలనే ఆగస్టు 15న అనంతకు రాష్ట్ర సిఎం వస్తున్న నేపథ్యంలో స్వాతంత్య్ర వేడుకల అనంతరం సూపర్ స్పెషాలిటీ నిర్మాణానికి శంకుస్థాపన చేయిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ ఉప మేయర్ సాకే గంపన్న, కార్పొరేటర్లు సరిపూటి రమణ, వడ్డెర్ల కార్పొరేషన్ ఛైర్మన్ దేవళ్ళ మురళీ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.