S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఘాట్లు.. జనాలకు పాట్లు!

మహబూబ్‌నగర్, జూలై 28: పుష్కరాల సమయం దగ్గర పడుతుండడంతో జిల్లాలో హడావిడి ఎక్కువైంది. జిల్లాలో 32 కృష్ణా పుష్కరాల మేజర్ ఘాట్లు, మరో 20 మైనర్ ఘాట్లుగా అధికారులు గుర్తించారు. జిల్లాలో పుష్కరాల పనులకు జిల్లా అధికార యంత్రాంగం దాదాపు రూ.426 కోట్లకు ప్రతిపాదనలు పంపడంతో ప్రభుత్వం రూ.270.21 కోట్లు మంజూరు చేసింది. అయితే పుష్కర ఘాట్ల పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. ముఖ్యంగా మొదటగా కృష్ణమ్మ అడుగుపెట్టే తంగిడి పుష్కర ఘాట్ పనులు నత్తనడకన, నాసిరకంగా పనులు కొనసాగుతున్నాయి. ఇంకా 40 శాతం పనులు చేయాల్సి ఉంది. తంగిడి గ్రామం నుండి పుష్కరఘాట్‌కు వెళ్లే ప్రధాన రోడ్డును బిటి రోడ్డుగా మార్చాల్సి ఉండగా కేవలం మట్టిని కొట్టి వదిలేశారు. వర్షాలతో ఈ రోడ్డంతా బురదమయంగా మారి రాకపోకలకు ఇబ్బందులను కలగజేస్తోంది. మరుగుదొడ్ల కోసం తీసిన పునాదుల్లోకి వర్షం నీరు చేరడంతో పనులు నిలిచిపోయాయి. వౌలిక వసతుల కల్పనలో అధికారులు ఘోరంగా విఫలవుతున్నారనే విమర్శలు అప్పుడే మొదలయ్యాయి. తాగునీటి వసతి కోసం తంగిడి దగ్గర ఎలాంటి నీటి ప్లాంట్‌ను ఇప్పటికీ ఏర్పాటు చేయకపోవడం దురదృష్టకరం. కృష్ణానది ప్రారంభంలో రెండవ ఘాట్ అయిన కృష్ణా బ్రిడ్జి దగ్గర కూడా పనులు ఆగమేఘాల మీద పనులు చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు. నాణ్యతను మరిచి పనులు చేశామని చెప్పుకునే విధంగా కాంట్రాక్టర్లు హడావిడి ఎక్కువ చేస్తున్నారు. ఇక్కడ మరుగుదొడ్ల నిర్మాణం ఆలస్యంగా కొనసాగుతోంది. మంచినీటి సౌకర్యానికి సంబంధించిన ట్యాంకులను కూడా ఏర్పాటు చేయలేదు. సాధారణ సమయంలోనే రద్దీగా ఉండే కృష్ణా గ్రామం పుష్కరఘాట్‌లో వౌలిక వసతులు కల్పించడంలో అధికారులు దృస్టి సారించకపోవడం శోచనీయం. ఇక మూడవ పుష్కరఘాట్‌గా పిలువబడే గుడేబల్లూర్ పంచాయతీ పరిధిలోని వాసునగర్ పుష్కర ఘాట్ల పనులు కూడా ఇంకా పూర్తికాలేదు. ఇక్కడా మరుగుదొడ్ల నిర్మాణం కేవలం పునాదులకు మాత్రమే పరిమితమైపోయాయి. పుష్కర ఘాట్ల దగ్గరున్న పురాతన ఆలయాల మరమ్మతుల పనులు శోభాయమానంగా తీర్చిదిద్దాల్సిన అధికార యంత్రాంగం దేవాలయాలను విస్మరిస్తున్నాయనే విమర్శలు తలెత్తుతున్నాయి. ఘాట్ దగ్గర ఉన్నటువంటి ఆలయాలను దర్శించుకోనున్న భక్తులకు దేవాలయాల ప్రాంగణంలో సౌకర్యాలపై కూడా దృష్టి సారించకపోవడం కృష్ణా పుష్కరాల్లో పనులు ఏవిధంగా ఉన్నాయో అద్దం పడుతుంది. ఏదేమైనప్పటికీ పాలమూరు జిల్లాలో పుష్కర పాట్లపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

చిత్రం.. దత్త భీమేశ్వరస్వామి దేవాలయం దగ్గర నాసిరకంగా కనబడుతున్న పుష్కరఘాట్