S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న వాతావరణ మార్పు సమస్య

గచ్చిబౌలి, జూలై 28: వాతావరణంలో మార్పుల సమస్య మనదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలను పీడిస్తున్న సమస్యగా మారిందని యుఎస్‌ఎఇపి మాజీ డైరక్టర్ ఎస్.సుబ్రమణ్యన్ అన్నారు. గచ్చిబౌలి ఇంజనీరింగ్ స్ట్ఫా కాలేజీలో జరిగిన క్లైమేట్ ఛేంజ్ ఛాలెంజెస్ అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రకృతిమాతకు ఓపిక ఎక్కువని మనం ఎన్ని తప్పులు చేసినా భరిస్తుందని ఒకప్పుడు పంచభూతాలను పూజించేవారమని అలాంటిది పంచభూతాలను మానవులే వినాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతిని కాపాడే బాధ్యత ఒక్క ప్రభుత్వానిదే కాదని ప్రజలు కూడా బాధ్యత వహించాలని ఆయన సూచించారు. ఎక్కడ పడితే అక్కడ చెత్తను పడవేయడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు అందరూ బాధ్యులై మెలగాలని అన్నారు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ మాజీ చైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి మాట్లాడుతూ 1993లో రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 50లక్షలు నిధులు ఉండేవని ఆ సమయంలో సహ మంత్రులు తన పోర్ట్‌పోలియోను చూసి హేళన చేశారన్నారు. అనంతరం ఆ పోర్ట్‌పోలియో విలువను పెంచడంతో పాటు అందరు ఆశ్చర్యపోయే విధంగా సమర్ధవంతంగా నిర్వహించడంతో పాటు ప్రాముఖ్యత పెంచానన్నారు. పట్టణ ప్రాంతాల్లో విపరీతంగా జనాభా పెరగడంతో పర్యావరణ సమస్యలు తలెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇండియా, చైనా, నైజీరియా దేశాల్లో ఉన్న జనాభా ప్రపంచ జనాభాలో 37శాతంగా ఉంటుందన్నారు. దేశ జనాభాలో 27.8శాతం ప్రజలు పట్టణ ప్రాంతాల్లోనే ఉంటున్నారని, 2021 నాటికి పట్టణాల్లో 33 మిలియన్ల జనాభా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో చిన్నపాటి వర్షం పడినా రోడ్లన్నీ జలమయంగా మారుతున్నాయని, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వసతులు ఏర్పాటు చేయడం కూడా ప్రభుత్వాలకు సమస్యగా మారిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా జీవన ప్రమాణాలు మెరుగుపరిస్తే వారు పట్టణాల వైపు చూసే అవకాశం ఉండదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇస్కీ సిసిసి డివిజన్ అడ్వయిజర్ బివి సుబ్బారావు, ఇస్కీ డైరక్టర్ డిఎన్ రెడ్డి, ప్రోగ్రామ్ ఇన్‌చార్జి బి.గోవర్ధన్, ప్రొ.పురుషోత్తమరెడ్డి, సైంటిస్ట్ డా.వనజ, ప్రోగ్రామ్ ఆఫీసర్ మాధవరావుపాల్గన్నారు.
ఇస్కీలో కలకలం
సృష్టించిన నాగుపాము...
సదస్సుకు ముఖ్య అతిథులు హాజరౌతుండగా ఇస్కీలో కోడెనాగు కలకలం సృష్టించింది. క్యాంటీన్ సమీపంలో బుసలు కొడుతున్న నాగుపామును చూసిన సిబ్బంది ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీకి సమాచారం అందించారు. పది నిముషాల వ్యవధిలో స్నేక్ సొసైటీ సభ్యులు నిఖిల్, నిఖిల, భావనారెడ్డిలు వచ్చి పామును బంధించారు. దీంతో ఉద్యోగులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.