S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఎలావుందీ వారం?

మేషం (ఏప్రిల్ 15 - మే 14)
నూతన విషయాలను అధ్యయనం చేసేందుకు సమాయత్తమవుతారు. ఇతరులకు సాయపడటం ద్వారా మీ అభిమతాలు కొన్ని నెరవేరుతాయి. మొత్తం మీద వ్యవహారాలన్నీ వారాంతానికి పూర్తి చేయగలగడం తృప్తినిస్తుంది. కళాత్మక విలువలకు, సంక్షేమ పథకాలకు, ఇచ్చి పుచ్చుకోవడాలకు 23, 24 తేదీలు అనుకూలం. ఆధ్యాత్మిక చింతన, యోగ సాధన మీలో నవ చైతన్యాన్ని నింపుతాయి. దీర్ఘకాల ప్రణాళికలకు శ్రీకారం చుడతారు. ఆగిపోయిన పనులను పూర్తిచేసే సూచనలున్నాయి.

వృషభం (మే 15 - జూన్ 14)
వ్యవస్థాగత లోపాలను సరిదిద్దడానికి ప్రణాళికలను తయారు చేస్తారు. ఉద్యోగ, వృత్తి రంగాల్లో ప్రోత్సాహకర మార్పులు చోటు చేసుకుంటాయి. ఆర్థికాభివృద్ధికై మీరు చేసే ప్రయత్నాలకు పెద్దల సహకారం తోడవుతుంది. శుభ కార్యనిర్వహణ, విందుల ద్వారా మనసు తేలికపరచుకో గలుగుతారు. అసహనం, ఆందోళన మంగళ, బుధవారాల్లో కలిగినా ఆలస్యంగానైనా అవసరమైన డబ్బు మీ చేతికందుతుంది. కుటుంబ వ్యక్తుల తోడ్పాటు వల్ల ముఖ్యమైన పనులన్నీ ఓ కొలిక్కి వస్తాయని ఆశించవచ్చు.

మిథునం (జూన్ 15 - జూలై 14)
చేజారిన అవకాశాలు కొన్ని మళ్లీ అందుబాటులోనికి రావచ్చు. నూతన బాంధవ్యాలు, మిత్రత్వాలు ఏర్పడుతాయి. గతంలో చేసిన కృషి మీకీ వారం ఫలప్రదంగా మారుతుంది. అస్థిరత్వం నుండి స్థిరత్వం దిశగా మీ ప్రయత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయనడంలో సందేహం లేదు. క్రయ విక్రయాలు, ఒప్పందాలు, ప్రమాణ పత్రాలు పునః పరిశీలన చేయడంవల్ల కొత్త విషయాలు తెలుసుకో గలుగుతారు. సోదర వర్గంతో కలిసి కృషి చేయడం ద్వారా భవిష్యత్ కార్యక్రమాల నిర్వహణపై అవగాహన పొందుతారు.

కర్కాటకం (జూలై 15 - ఆగస్టు 14)
ఇప్పటివరకూ మిమ్మల్ని ఉపయోగించుకున్న వారు ఈ వారంలో మీకు ఉపయోగ పడతారు. సద్భావనా యాత్రలు, సామరస్య చర్చల ద్వారా ముఖ్య సమస్యలు కొన్ని పరిష్కరింపబడతాయి. బంధు మిత్రుల కలయికతో గృహ వాతావరణం సందడిగా ఉంటుంది. ఆత్మీయుల కోరికలు తీర్చి ఆనందం పొందుతారు. పెట్టుబడులు, ప్రణాళికలకు అవసరమైన డబ్బు ఏదో విధంగా మీ చేతికందుతుంది. ఆటంకాలెదురైనా అచంచలమైన దీక్షతో కృషి చేసి మీ లక్ష్యాలను చేరుకో గలగడం చెప్పుకోదగ్గ విశేషం.

సింహం (ఆగస్టు 14 - సెప్టెంబర్ 14)
వాస్తవాలను అర్థం చేసుకుని దినచర్యలలో అవసరమైన మార్పులు చేపడతారు. ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి. సభలు, సమావేశాలలో మీ ప్రాధాన్యత పెరుగుతుంది. విద్యా వాణిజ్యాలు మెరుగైన రీతిలో కొనసాగుతాయనవచ్చు. కుటుంబ వ్యక్తుల అనారోగ్యం, అసంతృప్తి తొలగేందుకు మీ వంతు కృషి చేస్తారు. రాబడి పెరగడంతో భవిష్యత్ ప్రణాళికలపై దృష్టి సారిస్తారు. పాత బాకీలు కొన్ని తీర్చి మనశ్శాంతి పొందుతారు. శుభకార్య నిర్వహణకై వనరుల సమీకరణ జరుగుతుంది. చిరకాల కోరికలు నెరవేరుతాయి.

కన్య ( సెప్టెంబర్ 15- అక్టోబర్ 14)
అవసరాలు పెరిగినా తగినంత ఆదాయం లేక వారారంభంలో అసహనం కలుగవచ్చు. క్రమేపీ పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. నూతన వస్తువులు, ఆధునిక పరికరాలు సమకూర్చుకో గలుగుతారు. ఇతరుల బాధ్యతలు మీ మీద పడకుండా జాగ్రత్త వహించండి. విద్యార్థులు మెరుగైన ఫలితాల నందుకోగలుగుతారు. నేత్ర, ఉదర సంబంధ అనారోగ్యం తాత్కాలికంగా ఇబ్బంది పెట్టవచ్చు. చిరకాల మిత్రులను కలుసుకుని అనుభవాలను పంచుకుంటారు. బదిలీలు, ప్రమోషన్లకు అవకాశాలు ఉన్నాయి.

తుల (అక్టోబర్ 15- నవంబర్ 14)
మిమ్మల్ని ప్రతిఘటించిన వారే మీకు మిత్రులుగా మారుతారు. సంధి ప్రయత్నాలు, సమాలోచనలు సఫలమవుతాయి. ఖర్చులు అపరిమితంగా ఉన్నా అవసరమైన డబ్బు సకాలంలో చేతికందుతుంది. మృదు భాషణంతో, నైపుణ్య ప్రదర్శనంతో మీ ప్రాముఖ్యత ద్విగుణీకృతమవుతుంది. బంధుమిత్రులతో రాకపోకలు, కలయికలు పెరుగుతాయి. ప్రణాళికాబద్దంగా వ్యవహరించి వృత్తి ఉద్యోగాలలో లక్ష్యాలను చేరుకుంటారు. నూతన పదవులు లభిస్తాయి.

వృశ్చికం (నవంబర్ 15-డిసెంబర్ 14)
వివిధ విషయాలపై పరిజ్ఞానం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. బాధ్యతల నిర్వహణలో ఆత్మీయులు మీ వెన్నంటి ఉంటారనవచ్చు. ప్రత్యర్థులు బలహీనపడుతారు. ఖర్చులు అధికంగానే ఉన్నా ఆదాయ మార్గాలు పెరగడంతో పనులు నిరాటంకంగా సాగుతాయి. వృత్తి పనివారు, కళాకారులు గుర్తింపు, అభివృద్ధి సాధించగల తరుణమిది. అడ్డంకులు తొలగి భాగస్వాములతో రాబోయే పరిణామాలు, మార్పుల గూర్చి చర్చిస్తారు. ఆరోగ్యం, బీమా, రుణాలు, పెట్టుబడులకు సంబంధించిన విషయాలు ఈ వారం ప్రాధాన్యత సంతరించుకుంటాయి.

ధనస్సు (డిసెంబర్ 15-జనవరి 14)
దీర్ఘకాలంగా వాయిదా పడుతున్న పనులు గురు, శుక్రవారాల్లో పూర్తి చేయగలుగుతారు. వివాహ ప్రయత్నాలు, నిర్ణయాలు, వేడుకలతో సందడి వాతావరణం నెలకొంటుంది. సన్నిహితుల ఆరోగ్యం కలవరపెడుతుంది. సృజనాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలను చేరుకుంటారు. 25, 26 తేదీల్లో విద్యార్థులు అనుకోని అవకాశాలను అందుకోగలరు. ప్రియ మిత్రులతో ముచ్చటించి మనసు తేలిక పరచుకుంటారు. రీసెర్చి, నిర్మాణ సంబంధ విషయాల్లో మీ కృషి కొనియాడబడుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడుతాయి.

మకరం (జనవరి 15-ఫిబ్రవరి 14)
చిరాకులు, మనోవేదనలు తొలగిపోతాయి. మీ ప్రతిభ వెలుగులోనికి వచ్చేందుకు సరైన అవకాశాలు లభ్యమవుతాయి. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఆదాయం, పలుకుబడి పెరగడం చెప్పుకోదగ్గ విశేషం. విలువైన వస్తువులు మీ వద్దకు చేరుతాయి. వృత్తి ఉద్యోగాలు విజయవంతంగా సాగడంతో మీ ఆత్మవిశ్వాసం ద్విగుణీకృతమవుతుంది. స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి పొందే సూచనలున్నాయి. అధికారం, హోదా పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతుంది.

కుంభం (ఫిబ్రవరి 15-మార్చి 14)
ప్రతిబంధకాలను లెక్కచేయక, ఇనుమడించిన ఉత్సాహంతో కృషి చేసి కార్యసాధకులుగా పేరు పొందుతారు. మీ ప్రాధాన్యతను గుర్తించి పెద్దలు, అధికారులు సముచిత బాధ్యతలను మీకప్పగిస్తారు. విద్యార్థులు శ్రమకు తగ్గ ఫలితాలు పొందగలరు. పనుల వత్తిడి మీ ఆరోగ్యంపై ప్రభావం చూపకుండా జాగ్రత్త వహించండి. రమణీయ స్థలాలు, దృశ్యాలను తిలకిస్తారు. కుటుంబ వాతావరణం సుఖ సంతోషాలను కూర్చుతుందనడంలో సందేహం లేదు. బృంద కార్యక్రమాలలో పాల్గొంటారు. రవాణా కాంట్రాక్టులు, రచనా వ్యాసంగాలు ఆసక్తికరంగా ఉంటాయి.

మీనం ( మార్చి 15- ఏప్రిల్ 14)
మేధావులనుకున్న వాళ్లందరూ మిమ్మల్ని అంచనా వేయడంలో పొరబడుతారు. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ పనికిరాదు. ఏ విషయంలోనూ సత్వర ప్రగతి లేకున్నా వారాంతానికి వ్యవహారాల్లో అధిక భాగం పూర్తి చేయగలుగుతారు. సమాజ, వృత్తి సంబంధ విషయాల్లో వ్యతిరేక శక్తులను సమర్థవంతంగా నిలువరించ గలుగుతారు. మీ మీద నమ్మకంతో కొత్త బాధ్యతలు అప్పగింపబడుతాయి. వేతనాలు, అలవెన్సులలో వృద్ధికి అవకాశాలు ఉన్నాయి. బంధువర్గంలో మీ మాటకు విలువ, గుర్తింపు పెరుగుతాయనవచ్చు. శ్రేయోభిలాషులను కలుస్తారు.

ఎస్.రవిప్రకాశ్