S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఇంటింటికీ నల్లా నీరు సరఫరా

శేరిలింగంపల్లి, జూలై 28: ఇంటింటికీ నల్లా నీరు సరఫరా చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నట్టు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ తెలిపారు. చందానగర్ డివిజన్ పరిధిలోని హుడా ఫేజ్2లో తాగునీటి పైప్‌లైన్ పనులకు చందానగర్ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డితో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈప్రాజెక్ట్ ద్వారా ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇప్పించేందుకు శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో 290కోట్ల అంచనా వ్యయంతో పనులు జరుగుతున్నట్టు వివరించారు. అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జలమండలి చందానగర్ మేనేజర్ అన్విత్, టిఆర్‌ఎస్ నేత బొబ్బ విజయ్‌రెడ్డి, ఎం.ప్రసాద్, ఆశారెడ్డి పాల్గొన్నారు.