S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

గీతం వర్సిటీలో రక్తదాన శిబిరం

హైదరాబాద్, జూలై 28: హైదరాబాద్ శివార్లలో రుద్రారం వద్దనున్న గీతం విశ్వవిద్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. గీతం వర్సిటీ విద్యార్థులతో ఏర్పాటైన రోటరాక్ట్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరం ఏర్పాటైంది. గీతం యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ శివప్రసాద్ ఈ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తం అత్యవసరమైన పేదలకు సాయం చేసే ఉద్దేశంతో తమ యూనివర్సిటీ విద్యార్థులు చేపట్టిన ఈ కార్యక్రమం స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో వర్సిటీకి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ త్రినాథరావు, రెసిడెంట్ డైరెక్టర్ డాక్టర్ వర్మ పాల్గొన్నారు.