S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పంచాంగంలో చెప్పినట్టే...!

హైదరాబాద్, జూలై 28: ఉగాది రోజున తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన పంచాంగ శ్రవణం ప్రస్తుతం హాట్ టాపిక్‌లా మారింది. ఆ రోజు పంచాంగ పఠ నం చేసిన పండితుడు అచ్చంగా చెప్పినట్టుగానే వైద్యశాఖను ఆరోపణలు చుట్టుముట్టాయి. మొన్న సరోజిని దేవి ఆస్పత్రిలో కంటి ఆపరేషన్లు చేసుకున్న 14 మంది రోగుల కళ్లు పోవడం పెద్ద దుమారం రేకెత్తించిన విషయం తెలిసిందే. తాజా గా ఎంసెట్-2 ప్రశ్నాపత్రాల లీకేజి వ్యవహారంతో వైద్యశాఖ పరువు బజారున పడింది. ఉగాదినాడు పంచాంగ పఠనంలో ఈ ఏడాది వైద్య, విద్యాశాఖల్లో అవినీతి పెరుగుతుందని, అనేక ఆరోపణలు వస్తాయని వెల్లడించారు. ఆ కార్యక్రమానికి హాజరైన తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జోక్యం చేసుకుంటూ ఈసారి విద్య, వైద్యశాఖ మంత్రులు మరింత అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలని సుతిమెత్తగా హెచ్చరించారు. అలాగే ఎన్ని ఆరోపణలు వచ్చినా వాటిని అధిగమించే శక్తియుక్తులు విద్యా, వైద్య మంత్రులు కడియం శ్రీహరి, లక్ష్మారెడ్డికి ఉన్నాయని కూడా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఇలా ఉండగా ఆ రోజు పంచాంగ పఠనం చేసిన పండితుడు అచ్చంగా చెప్పినట్టుగానే వైద్యశాఖలో జరుగుతున్న పరిణామాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.