S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

విస్తృత ధర్మాసనానికి హైకోర్టు విభజన కేసు

హైదరాబాద్, జూలై 28: ఉమ్మడి హైకోర్టును విభజించాలని, గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును పున:సమీక్షించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్రప్రభుత్వం, తెలంగాణ న్యాయవాదుల సంఘం దాఖలు చేసిన పిటిషన్లను విచారణ నిమిత్తం విస్తృత ధర్మాసనానికి హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్ర హైకోర్టును హైదరాబాద్‌తో సహా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయడాన్ని చట్టం అనుమతించదంటూ హైకోర్టు గతంలో తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును పున:సమీక్షించాలని అడ్వకేట్ కె రవీందర్ రెడ్డితో పాటు, తెలంగాణ ప్రభుత్వం తరపున పిటిషన్‌లు దాఖలయ్యాయి. వీరి వాదనలు విన్న తర్వాత హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి బోసలే, జస్టిస్ పివి సంజయ్ కుమార్‌లు పై ఆదేశాలు జారీ చేశారు. రెండు అంశాల ప్రాతిపదికన ఈ కేసును విస్తృత ధర్మాసనానికి నివేదించినట్లు హైకోర్టు పేర్కొంది. హైకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల రాష్టప్రతి కోర్టు విభజనను నోటిఫై చేసే అధికారాన్ని నిలుపుదల చేసేటట్లుగా ఉందా ? ఈ తీర్పులో ఏమైనా తప్పులు దొర్లాయా ? ఇతర రాజ్యాంగ అంశాలు, రాష్టప్రతి హైకోర్టును నోటిఫై చేసేందుకు సంబంధించిన అధికారాలపై విచారించి తీర్పును ఇవ్వాల్సిందిగా ధర్మాసనానికి నివేదించినట్లు బెంచ్ పేర్కొంది. మద్రాసు హైకోర్టు నుంచి విడిపోయిన తర్వాత ఆంధ్ర హైకోర్టు ఏర్పాటైందని, ఆ తర్వాత 1956లో ఈ కోర్టును హైదరాబాద్ హైకోర్టులో విలీనం చేశారని బెంచ్ పేర్కొంది. రాజ్యాంగంలోని అంశాలను కూడా ధర్మాసనం అధ్యయనం చేస్తుందని బెంచ్ పేర్కొంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేసేందుకు వీలుగా గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రతులను నివేదించాలని రిజిస్ట్రీని హైకోర్టు ఆదేశించింది.