S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కాంగ్రెస్ నేతలది జోకర్ ముఠా

హైదరాబాద్, జూలై 28: అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణను ఎండబెట్టిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు తెలంగాణలో మంటపెడుతున్నారని టిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నెప్రభాకర్ విమర్శించారు. తెలంగాణ శాసన సభాపక్షం కార్యాలయంలోగురువారం జరిగిన విలేఖరుల సమావేశంలో ప్రభాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులది జోకర్ ముఠా అని మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణకు ఏమీ చేయలేకపోయిన నాయకులు ఇప్పుడు ప్రభుత్వాన్ని అడుగడుగునా అడ్డుకుంటున్నారని విమర్శించారు. ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు పూర్తయి కోటి ఎకరాలకు సాగునీరు అందితే తమకు రాజకీయంగా పుట్టగతులు ఉండవనే భయంతోనే ప్రాజెక్టులు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజల సెంటిమెంట్‌ను అడ్డుపెట్టుకొని ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టులో మొత్తం ఎనిమిది గ్రామాలు ముంపు బారిన పడుతుండగా, వీటిలో ఆరు గ్రామాల వాళ్లు భూములు ఇవ్వడానికి ఒప్పుకున్నారని చెప్పారు. విపక్షాలు హైదరాబాద్, సంగారెడ్డిల నుంచి తమ కార్యకర్తలను తరలించి రాజీవ్ రహదారిపై హింసాత్మక ఘటనలు సృష్టించారని విమర్శించారు. 2013 చట్టం, లేదా 123 జివో దేని ప్రకారం అయినా భూములకు పరిహారం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రభుత్వం ప్రకటించిన తరువాత కూడా విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. నదులు లేని చోట రిజర్వాయర్లు ఎందుకు అని మర్రిశశిధర్‌రెడ్డి లాంటి మేధావులు ప్రశ్నిస్తున్నారని, ఆంధ్రలో నదులు లేకపోయినా వెలిగొండ, అవుకు, అలుగునూర్ తదితర రిజర్వాయర్లను ఎందుకు నిర్మించారో చెప్పాలని ప్రశ్నించారు. ఖమ్మం జిల్లాలోని 800 గ్రామాలను ముంచి పోలవరం ప్రాజెక్టు కడుతున్నారని, నల్లగొండ జిల్లాలో వందలాది ఎకరాలను ముంచి పులిచింతల ప్రాజెక్టు కట్టారని ప్రభాకర్ తెలిపారు. కాంగ్రెస్ నాయకులు అక్కడ ఎందుకు ధర్నా చేయలేదని ప్రశ్నించారు.