S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఏడేళ్లలో మూడోసారి లీక్

హైదరాబాద్, జూలై 28: తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న ఎమ్సెట్ పరీక్ష మొదటి నుంచి వివాదాస్పదంగానే తయారైంది. ఎమ్సెట్ నిర్వహణలో చోటు చేసుకుంటున్న లోపాలను నిరోధించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి.
గత ఏడు సంవత్సరాల్లో మెడిసిన్ పరీక్ష ప్రశ్నాపత్రం లీకు కావడం ఇది మూడోసారి. 2010లో కడపలో కొంత మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరు ఎంసెట్ మెడిసిన్ ప్రశ్నాపత్రాన్ని లీక్ చేసేందుకు ప్రయత్నించారని అభియోగం. ఈ కేసులో ప్రధాన నిందితుడు గురివిరెడ్డి అక్రమ పద్ధతుల ద్వారా ప్రశ్నాపత్రం లీకేజీ చేసినట్లు దీని వల్ల రూ.18 లక్షలు సంపాదించినట్లు పోలీసులకు ఆ రోజుల్లో వాంగ్మూలంలో తెలిపాడు. 2010లో 71 ప్రశ్నలను లీక్ చేయడం ద్వారా పన్నిన పన్నాగం బెడిసికొట్టి పోలీసులకు దొరికిపోయాడు. 2014లో ఏపి పిజి మెడికల్ ఎంట్రన్స్ పరీక్ష పత్రం లీకైంది. ఇందులో 11 మంది విద్యార్థులను, తొమ్మిది మంది బ్రోకర్లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రస్తుతం టి ఎమ్సెట్-2లో కేసులో నిందితుడయిన రాజ్‌గోపాల్ రెడ్డి కూడా నిందితుడు. మణిపాల్ ప్రింటింగ్ ప్రెస్ నుంచి ఈ ప్రశ్నాపత్రాన్ని లీక్ చేశారు. తాజాగా ఈ ఏడాది టి ఎమ్సెట్-2 లీకేజిలో కూడా ఇదే గ్యాంగు కీలకపాత్ర వహించింది. గతంలో 1997, 2000 సంవత్సరంలో కూడా ఎమ్సెట్ ప్రశ్నాపత్రం లీకైంది. అప్పట్లో కార్పొరేట్ కాలేజీల పాత్ర ఉన్నట్లు వెల్లడైంది. 1997లో కోల్‌కతా ప్రింటింగ్ ప్రెస్‌లో, 2000 సంవత్సరంలో కన్వీనర్ కార్యాలయం నుంచి ప్రశ్నాపత్రం లీకైంది.