S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఏడాది లోగా గండికోటకు నీళ్లు..

జూపాడుబంగ్లా, జూలై 28:ఏడాదిలోగా పోతిరెడ్డిపాడు ద్వారా గండికోటకు నీళ్లు తీసుకెళ్తామని శాసనమండలి డిప్యూటీ స్వీకర్ సతీష్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌ను గురువారం సతీష్‌కుమార్‌రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడప జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణానికి చంద్రబాబు కంకణం కట్టుకున్నారన్నారు. గత కొన్ని తరాలుగా కడప జిల్లా చుక్కనీరు లేక అల్లాడుతుందని, ఆ జిల్లా వాసుల తాగు, సాగు నీటి సమస్యను పరిష్కరించేందుకు సిఎం చంద్రబాబు జిఎన్‌ఎస్ ప్రాజెక్టు నిర్మాణం పనులను శరవేగంగా చేయిస్తున్నారన్నారు. ప్రాజెక్టు నిర్మాణం పనులు పూర్తి కాగానే పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని తీసుకెళ్తామన్నారు. వైకాపా అధినేత జగన్ ఏనాడు జిఎన్‌ఎస్‌ఎస్ గురించి అసెంబ్లీలో చర్చించలేదని గుర్తుచేశారు. ఆయన వెంట జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, సింహాద్రిపురం జెడ్పీటిసి ప్రభాకర్‌రెడ్డి, మైలవరం ఎంపిపి మోహన్‌రెడ్డి, ఎస్‌ఇ రామచంద్రయ్య, ఇఇ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.