S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

బేతంచెర్ల కేంద్రంగా గుట్కా వ్యాపారం!

బేతంచెర్ల, జూలై 28:ప్రజారోగ్యం దృష్ట్యా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పొగాకు ఉత్పత్తులైన రాజాఖైనీ, సిమ్లా, హిందూస్థానీ, ఖలేజా తదితర వాటిని నిషేధించడంతో పాటు వాటిని విక్రయిస్తే శిక్షార్హులని చట్టాలు చేశాయి. అయితే బేతంచెర్లలోని ఓ ప్రముఖ కిరాణా స్టోర్ నిర్వాహకుడు, గతంలో ఎన్నో నిషేధిత వస్తువుల దొంగ వ్యాపారాల్లో పట్టుబడిన మరో వ్యక్తి కలిసి బేతంచెర్ల కేంద్రంగా లక్షల రూపాయల గుట్కా వ్యాపారం నిర్వహించేవారు. దాన్ని పసిగట్టిన పోలీసులు ఇటీవలే బనగానపల్లెకు చెందిన వ్యక్తిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. దీంతో వారు మండల పరిధిలోని గోరుమానుకొండకు మకాం మార్చారు. అయితే దీనిపై మాటువేసిన ఎస్‌ఐ హనుమంతురెడ్డి గురువారం దాడి చేసి 2,500 ప్యాకెట్లు స్వాధీనం చేసుకుని ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కాగా తెరవెనుక చక్రం తిప్పే కిరాణా స్టోర్ నిర్వాహకుడు పెద్దఎత్తున పైరవీలు చేస్తున్నట్లు తెలిసింది. అయితే పోలీసు ఉన్నతాధికారులు అందుబాటులో లేని కారణంగా కేసు నమోదు జాప్యం అవుతున్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. అయితే వ్యాపారులు మాత్రం కర్ణాటక నుంచి డిసిఎం లాంటి ప్రత్యేక వాహనాల్లో బేతంచెర్లకు తరలించి ఆ తరువాత బనగానపల్లె, కోవెలకుంట్ల, కొలిమిగుండ్ల, పాణ్యం, నందివర్గం, అవుకు తదితర మండలాలకు గుట్కా ప్యాకెట్లను తరలిస్తూ నెలకు రూ. కోట్ల చీకటి వ్యాపారం చేస్తున్నారు.