S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

గాజులదినె్న ప్రాజెక్టుకు జలకళ..

గోనెగండ్ల, జూలై 28:్భరీ వర్షాలకు నిండుకుండలా మారిన గాజులదినె్న ప్రాజెక్టును గురువారం ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ గాజులదినె్న ప్రాజెక్టు వద్ద ఆధునీకరణ పనులు చేపట్టేందుకు ప్రభుత్వం రూ. 1.75 కోట్లు మంజూరు చేసిందన్నారు. ఆ నిధులను డ్యాం దగ్గర అవసరమయ్యే వాటికి ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది వరుణ దేవుడి కరుణతో వర్షాలు రైతులకు అనుకూలించాయని, ఈ వానల వల్ల డ్యాంలోకి పూర్తిస్థాయిలో నీరు చేరిందన్నారు. డ్యాంలో భారీగా వరద నీరు చేరడంతో వచ్చే రబీ సీజన్‌లో రైతులకు సాగు నీరందిస్తామన్నారు. వర్షాలకు భారీగా వచ్చే నీటిని డ్యాం కుడి, ఎడమ కాలువల ద్వారా దిగువన ఉన్న చెరువులు, నీటి కుంటలకు మళ్లించాలని నీటి పారుదల శాఖ అధికారులకు సూచించారు. ఈయన వెంట నీటి పారుదల శాఖ అధికారులు లక్ష్మణ్‌కుమార్, ఏఇ ప్రసాద్, టిడిపి నాయకులు పార్వతమ్మ, ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.