S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వైద్యుడి హత్యకేసులో నలుగురి అరెస్టు

కర్నూలు, జూలై 28:నంద్యాల పట్టణానికి చెందిన ప్రభుత్వ వైద్యుడు శైలేంద్రరెడ్డి(38) హత్య కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అలాగే వారి నుంచి 4 సెల్‌ఫోన్లు, 2 మోటార్‌బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి గురువారం ఎస్పీ ఆకే రవికృష్ణ నగరంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఉన్న వ్యాస్ ఆడిటోరియంలో విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. డాక్టర్ శైలేంద్రరెడ్డి ఈ నెల 26వ తేదీ రాత్రి బంధువులను నంద్యాల ఆర్టీసీ బస్టాండ్‌లో దింపేందుకు తన కారులో వెళ్లారు. ఆ తర్వాత కారు తీస్తుండగా వెనుక వైపు ఉన్న ద్విచక్ర వాహనానికి తగిలింది. దీంతో ఆ బైక్‌కు సంబంధించిన నలుగురు యువకులు డాక్టర్‌తో గొడవ పడ్టారు. అనంతరం డాక్టర్ కారులో ఇంటికి వెళ్తుండగా ఆ యువకులు ద్విచక్ర వాహనాల్లో వెంబడించి శ్రీనివాస సెంటర్‌లో కారుకు అడ్డంగా బైక్‌లు నిలిపారు. మరోసారి వైద్యుడితో ఘర్షణ పడి తలపై బండరాయితో దాడి చేయడంతో డాక్టర్ తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు అతడిని నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే వైద్యుడు మృతి చెందినట్లు అక్కడి వైద్యులు ధ్రువీకరించారన్నారు. వైద్యుడి బంధువుల ఫిర్యాదు మేరకు నంద్యాల 1వ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి నంద్యాల డీఎస్పీ హరినాథరెడ్డి ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేశారు. అందిన సమాచారం మేరకు గురువారం ఉదయం 8 గంటలకు నంద్యాల చెరువుకట్ట దాటిన తరువాత మూలమట్టం దగ్గర నంద్యాల పట్టణంలోని ఉప్పరిపేటకు చెందిన వలి కుమారుడు షేక్ సల్మాన్, చాంద్‌బాషా కుమారుడు షేక్‌వలి, మక్బుల్ కుమారుడు షేక్ ఇమ్రాన్, పార్కుడోడ్డుకు చెందిన అబ్దుల్‌హమీద్ కుమారుడు కమ్ముబాయ్‌లను అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో పురోగతిని సాధించి నిందితులను అరెస్టు చేసిన డీఎస్పీ హరినాథరెడ్డి, 1వ పట్టణ సిఐ ప్రతాపరెడ్డి, ఎస్‌ఐ లు ఎస్వీ రమణ, హరిప్రసాద్, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. సమావేశంలో నంద్యాల డీఎస్పీ హరినాథరెడ్డి, సిఐ ప్రతాపరెడ్డి పాల్గొన్నారు.