S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

గాంధీజీ విగ్రహం ధ్వంసం

మహానంది, జూలై 28: మహానందిలోని తెలుగుగంగ కాల్వ సమీపంలో ఉన్న జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు రాళ్లతో ముఖాన్ని ఛిద్రం చేసి పగులగొట్టారు. దేశమే గర్వించాల్సిన జాతిపిత విగ్రహాన్ని రాళ్లతో దాడిచేసి ధ్వంసం చేయడంపై పలువురు పలు విధాలుగా విమర్శిస్తున్నారు. విగ్రహం వద్ద ఉన్న పొలం రైతు స్థలం ఆక్రమించుకొనేందుకు విగ్రహాన్ని పగులగొట్టించాడా? అన్న అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇందుకు నిదర్శనం విగ్రహం చుట్టూ ఉన్న స్థలాన్ని పిచ్చి మొక్కలు తొలగించి చదును చేయడంపై ఈ విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. దీనిపై పోలీసులు విచారణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఫారం కృషియూత్ సభ్యులు గత కొనే్నళ్లుగా ఆ విగ్రహం వద్ద గాంధీ జయంతి, ఆగస్టు వేడుకలను నిర్వహిస్తుంటారు. ఆగస్టు 15 సమీపిస్తున్న సమయంతో విగ్రహం వద్దకు వెళ్లి చూడగా వారికి గాంధీజీ విగ్రహం ఛిద్రమైన సంఘటన కనిపించింది. గత ఏడాది కూడా ఇలాగే చేస్తే వారు మరమ్మతులు చేయించారు. ప్రతి ఏడాది ఇలా చేస్తుండడంపై వారు కుట్ర పూరితంగా చేస్తున్నారని విమర్శించారు. అధికారులు శాశ్వత పరిష్కారం చూపించాలని ప్రజలు కోరుతున్నారు.