S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

గడువులోగా పుష్కర పనులు పూర్తి

కర్నూలు, జూలై 28:కృష్ణా పుష్కరాల పనులను గడువులోగా పూర్తి చేయడంతో పాటు భక్తుల భద్రతకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తామని కలెక్టర్ విజయమోహన్ భరోసా ఇచ్చారు. శ్రీశైలంలోని పాతాళగంగలో నూతనంగా నిర్మిస్తున్న పుష్కరఘాట్ సమీపంలో కొండ చెరియలు విరిగి పడిన ప్రాంతాన్ని గురువారం కలెక్టర్ దేవస్థానం ఇఓ సత్యానారాయణ భరత్‌గుప్తాతో కలిసి పరిశీలించారు. ఇటీవల కురిసిన వర్షాలకు కొండ చెరియలు విరిగిపడిన ప్రాంతాల వద్ద తీసుకుంటున్న చర్యలపై ఇఓ కలెక్టర్‌కు వివరించారు. విజయవాడలోని కనకదుర్గమ్మ గుడి ప్రాంతంలో కొండ చెరియలు విరిగిపడకుండా తీసుకున్న చర్యల తరహాలోనే ఇక్కడ కూడా చేపడుతున్నట్లు తెలిపారు. కొండ చెరియలు విరిగి పడకుండా 100 మీటర్ల వెడల్పు, 25 మీటర్ల ఎత్తు సామర్థ్యంతో హైటెన్షన్ లైన్ పిల్లర్లు వేసి కొండకు ఆనుకుని మెష్ జార వేసి ఉపరితల భాగంలో రెట్టింపు సామర్థ్యంతో భీమ్‌లతో నిర్మాణం చేపట్టాలని కలెక్టర్ సంబంధిత కాంట్రాక్టర్లను ఆదేశించారు. అవసరమైతే డిజైన్‌లో మార్పులు చేసి ప్రతిపాదనలు పంపుతామన్నారు. నూతనంగా నిర్మించే ఘాట్ పనులు వచ్చే నెల 2వ తేదీలోగా పూర్తి చేసేందుకు రాత్రింబవళ్లు పనులు చేయాలని ఇంజినీర్లను ఆదేశించారు. పునరుద్ధరించిన పాత ఘాట్లను పరిశీలించి డ్యామ్ ఎస్‌ఇ మల్లికార్జునరెడ్డికి పలు సూచనలు చేశారు. అనంతరం టాయ్‌లెట్లు, పిండ ప్రదాన షెడ్లను కలెక్టర్ పరిశీలించారు. అలాగే డ్యామ్ దిగువ భాగాన ఉన్న లింగాలగట్టు ఎగువ, దిగువ పుష్కర ఘాట్లను పరిశీలించారు. పార్కింగ్ ప్రదేశాన్ని చదును చేయాలని గత పర్యటనలోనే సూచించినా చేయకపోవడంపై ఇఇపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే పార్కింగ్ పనులు చేపట్టాలని ఆదేశించారు. ఎగువ భాగాన పుష్కర ఘాట్‌లో 670 క్యుబిక్ మీటర్ల వర్కు పెండింగ్‌లో ఉందని 3 రోజుల్లో పనులు పూర్తవుతాయని ఇఇ కలెక్టర్‌కు నివేదించారు.