S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సరిహద్దు చేరిన ఎల్లెల్సీ నీరు

ఆదోని, జూలై 28: తుంగభద్ర దిగువ కాలువ ద్వారా విడుదల చేసిన నీళ్లు రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన హనవాల్ గేజ్ పాయింట్ వద్దకు గురువారం చేరుకున్నాయి. కాలువలో మూడు అడుగుల మేరా నీళ్లు ప్రవహించాయి. తుంగభద్ర డ్యాం నుంచి నది దిగువ కాలువకు 650 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని దిగువ కాలువ అధికారులు తుంగభద్ర బోర్డుకు ఇండెంట్ పెట్టారు. ఇప్పటికి 300 క్యూసెక్కుల మేరకు కాలువకు నీటిని విడుదల చేశారు. ఇంకా విడతల వారిగా నీటిని విడుదల చేస్తున్నారు. తుంగభద్ర దిగువ కాలువకు నీటి సరఫరా కావడంతో మున్సిపల్ అధికారులు బసాపురం పంపుహౌస్ వద్ద ఆదోని పట్టణానికి తాగునీటిని విడుదల చేయడానికి సన్నద్ధం అవుతున్నారు. తుంగభద్ర దిగువ కాలువ నీటి ఆధారంగానే ఆదోని డివిజన్‌లో ఉన్న తాగునీటి పథకాలకు నీరు సరఫరా అవుతుంది. ఆదోని డివిజన్‌లోని ఎస్‌ఎస్ ట్యాంకులకు కూడా దిగువ కాలువనీరే ఆధారం. అందువల్ల గ్రామీణ తాగునీటి అధికారులు ఎస్‌ఎస్ ట్యాంకులకు నీటిని నింపేందుకు చర్యలు చేపట్టారు. తుంగభద్ర దిగువ కాలువ నీటి వల్ల 240 గ్రామాలకు తాగునీరు సరఫరా అవుతుంది. సాగునీరు కూడా తుంగభద్ర నీరే ఆధారం. ఖరీఫ్ సీజన్‌లో 41వేల ఎకరాలను స్థిరీకరించారు. అయితే ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్‌కు 30వేల ఎకరాలకు మాత్రమే నీటిని సరఫరా చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈసంవత్సరం కాలువకు ముందుగానే నీళ్ళు రావడంతో వరి నాట్లు వేసే కార్యక్రమానికి రైతులు సన్నద్ధం అవుతున్నారు. దిగువ కాలువకు నీరు రావడం వల్ల తాగు, సాగునీటికి కొరత లేకుండా పోయింది. నీటి సరఫరాతో మున్సిపల్, గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు నీటి ఎద్దడి తీరిందని ఊపిరి పీల్చుకున్నారు.