S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అంగరంగ వైభవంగా ఆడికృత్తిక వేడుకలు

చిట్టమూరు, జూలై 28: మండలంలోని మల్లాం గ్రామంలో వెలసిన స్వయంభు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆడికృత్తిక వేడుకలు ముచ్చలగుంట గ్రామస్థుడు ఓడూరు రమణారెడ్డి, విజయలక్ష్మిల ఆధ్వర్యంలో గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా స్వామివారికి ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ, పాలాభిషేకం, అరోణదయ కాలపూజ, 7 గంటలకు మహన్యాస పారాయణం, ఏకాదశ రుద్రాభిషేకం, పంచామృతాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆలయంలోని వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి మూలవిరాట్ విగ్రహాలకు చందనాలంకారం గావించి భక్తులకు దర్శనం కల్పించారు. ఆలయాన్ని ప్రత్యేక పుష్పాలు, పలు రకాల పండ్లు, విద్యుత్ దీపాలతో అలంకరించారు. స్వామి, అమ్మవారి ఉత్సవ విగ్రహాలను శతస్తంభ కల్యాణ మండపంలోని కల్యాణ వేదికపై ఉంచి వేదపండితుల మంత్రోచ్ఛరణాలు, భాజాభజంత్రీల నడుమ అశేష భక్తజనం తిలకిస్తుండగా స్వామివార్ల శాంతి కల్యాణం నిర్వహించారు. రాత్రి స్వామివారికి గ్రామోత్సవం జరిపారు. మండలంలోని పలు ఆలయాల్లో ఆడికృత్తిక వేడుకలను వైభవంగా నిర్వహించారు. సాయంత్రం గ్రామోత్సవం నిర్వహించారు. ఈ వేడుకల్లో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.