S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సింహపురి ఎక్స్‌ప్రెస్ వేళల మార్పు

నెల్లూరు, జూలై 28: ప్రయాణికుల సౌకర్యార్ధం గూడూరు- సికింద్రాబాద్ నడుమ నడిచే సింహపురి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు వేళలను మార్పు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ముఖ్య పౌరసంబంధాల అధికారి ఉమాశంకర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రైలు గూడూరులో కొత్త సమయం ప్రకారం సాయంత్రం 6.50 గంటలకు బయల్దేరి వేదాయపాలెం రైల్వేస్టేషన్‌కు 7.10కి చేరుకుంటుంది. అక్కడ్నుంచి 7.11కి బయల్దేరి నెల్లూరు ప్రధాన రైల్వేస్టేషన్‌కు సాయంత్రం 7.18 గంటలకు చేరుకుని అక్కడ్నుంచి 7.20కి బయల్దేరుతుంది. బిట్రగుంటకు 7.45కి, కావలికి 7.55కు చేరుకునే ఈ రైలు అక్కడ్నుంచి 7.56 గంటలకు బయల్దేరి సింగరాయకొండ 8.20కి చేరుకుంటుంది. ఒంగోలు 8.40 గంటలకు, 9.19కి చీరాల, రాత్రి 9.30కి బాపట్ల, 10.05కి తెనాలి, 11.10 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. అక్కడ 11.23 గంటలకు బయల్దేరి మరుసటి రోజు అర్ధరాత్రి 12 గంటలకు మధిర, 12.33 గంటలకు ఖమ్మం, 1.18కి మహబూబాబాద్, 2.15కి వరంగల్, 2.33కి ఖాజీపేట, తెల్లవారుజాము 5.40కి సికింద్రాబాద్‌కు చేరుకోనుంది. సికింద్రాబాద్ నుంచి గూడూరుకు వచ్చే వేళల్లో ఎటువంటి మార్పు ఉండదు. అయితే ప్రస్తుతం ఉదయం 9.20 గంటలకు గూడూరుకు వచ్చే ఈ సింహపురి ఎక్స్‌ప్రెస్ సవరించిన వేళల వల్ల ఉదయం 8.50 గంటలకే చేరుకుంటుందని రైల్వే అధికారులు తెలిపారు. సవరించిన వేళలు ఈ ఏడాది అక్టోబర్ 1వ తేది నుంచి అమల్లోకి రానున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఫలించిన మేకపాటి ప్రయత్నం
సింహపురి ఎక్స్‌ప్రెస్ వేళలు అనువుగా లేనందువల్ల వేళలను మార్చాలని ఎప్పట్నుంచో కోరుతున్నారు. ఈక్రమంలో నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఇప్పటికే పలుమార్లు రైల్వే అధికారులకు, రైల్వే మంత్రి సురేష్ ప్రభు, జిల్లాకు చెందిన మరో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల నెల్లూరుకు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన రైల్వే మంత్రి సురేశ్‌ప్రభు దృష్టికి ఇదే విషయాన్ని మరోసారి ఆయన తీసుకెళ్లారు. దీనికి స్పందనగా సింహపురి ఎక్స్‌ప్రెస్ వేళల్లో మార్పు చేశారు. రైల్వే మంత్రికి, అధికారులకు జిల్లా ప్రజల తరపున మేకపాటి కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలావుండగా ఎప్పట్నుంచో సికిందరాబాద్‌కు వెళ్లే సింహపురి ఎక్స్‌ప్రెస్ వేళలను మార్చాలని కోరుతున్న ప్రయాణికుల కల నెరవేరింది.