S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్రజల ప్రాణాలతో చెలగాటం

నెల్లూరు, జూలై 28: వ్యాధుల కాలం.. రోగాలు ముసురుతున్నాయి. శుద్ధి జలంతోనే కాసింత ప్రాణానికి ఊరట లభిస్తుంది. కాని మనం నిత్యం తాగుతున్న నీటిలో స్వచ్ఛతను తరచి చూస్తే గుండె గుభేల్‌మనాల్సిందే. జిల్లా కేంద్రమైన నెల్లూరు నగరంలో పుట్టగొడుగుల్లా వాటర్‌ప్లాంట్లు ఏర్పాటయ్యాయి. జిల్లా అంతటా వందల సంఖ్యలో ఈ వాటర్‌ప్లాంట్లు నీటి సరఫరా చేస్తున్నాయి. ఒక్క నెల్లూరు నగరంలో చిన్నవి, పెద్దవి కలిపి రెండు వందలకు పైగా ఉన్నాయి. అయితే ఈ వాటర్‌ప్లాంట్లను నిర్వహించాల్సినవారు కచ్చితంగా ఐఎస్‌ఐ అనుమతులు తీసుకోవాల్సి ఉంది. కాని నగరంలో శుద్ధి నీటిని సరఫరా చేస్తున్న కొందరు నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా తాగునీరు సరఫరా చేస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీని కారణంగా ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు.
కాసులకు దాసోహం
సాధారణంగా వాటర్‌ప్లాంట్ల నిర్వాహకులు ప్రతి మూడు నెలలకోసారి నీటి నమూనాను తీసుకెళ్లి నీటి నాణ్యత విశే్లషణ కేంద్రంలో పరీక్షలు చేయించుకోవాలి. అక్కడ ఈ నీరు ఏ స్థాయిలో ఉంది, అందులో లవణాల పరిస్థితి అతిగా శుద్ధి చేస్తున్నారా అనే అంశాలను పరీక్షించుకోవాలి. ఒకవేళ పరీక్షల్లో తేడా ఉంటే కొన్ని మార్పులు చేసుకోవాలి. కాని జిల్లాలో ఎక్కడా ఈ పద్ధతి అమలు కావడంలేదు. అయితే కొన్ని ప్లాంట్లు మాత్రం ప్రతినెలా పరీక్షలు జరిపించుకుంటున్నాయి. మరికొందరు అటు అధికారులను, ఇటు ప్రజలను మోసం చేస్తూ జేబులు నింపుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వాటర్‌ప్లాంట్లపై నిఘా ఉంచాల్సిన అధికారులు మాత్రం ప్లాంట్ల యజమానులు ఇచ్చే కాసులకు కక్కుర్తిపడి పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాటర్ ప్లాంట్ల నిలువుదోపిడీ
కొందరు వాటర్ ప్లాంట్ల నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా విక్రయాలు సాగిస్తున్నారు. ప్లాంట్లలో ఏమాత్రం నిబంధనలు పాటించకుండా నీటిని అరకొరగా శుద్ది చేస్తూ విక్రయించేస్తున్నారు. నగరంలో ప్రధానంగా కార్పొరేషన్ వారు విడుదల చేస్తున్న నీరు కలుషితం అవుతుండడంతో నగర ప్రజలంతా వాటర్ ప్లాంట్లపై ఆధారపడుతున్నారు. దీంతో వాటర్‌ప్లాంట్ల నిర్వాహకులు దీనిని ఆసరాగా తీసుకుని ఇష్టారాజ్యంగా నీటిని శుద్ధి చేయకుండానే డబ్బాలు నింపి సరఫరా చేస్తున్నారు. మరికొందరు ఏకంగా చిన్న ఆటోల్లో కొళాయి నీరు పట్టుకొని పది డబ్బాలకు ఒక డబ్బా చొప్పున కలిపి అమ్ముతున్నారు. కొళాయి నీరు తాగి జబ్బుల బారిన పడతామన్న భయంతో ప్లాంట్ల నుంచి తెచ్చుకొని తాగుతున్నామని కాని వాటర్‌ప్లాంట్ల నుంచి వచ్చే నీరు కూడా కలుషితంగా వస్తున్నాయని దీని కారణంగా వ్యాధుల బారిన పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు. వాటర్‌ప్లాంట్ల నుంచి వచ్చే ఆటోలు ఒక క్యాన్‌కు 15 నుంచి 20 రూపాయల వరకు తీసుకుంటున్నారు. అదే స్వయంగా ప్లాంటుకు వెళ్లి తెచ్చుకుంటే క్యాన్ 10 రూపాయలు చొప్పున తీసుకుంటున్నారు. చిన్న, చిన్న వ్యాపారులకు క్యాన్‌కు రూ.5 చొప్పున తీసుకుని ఇస్తున్నారు. దీంతో చిరు వ్యాపారులు కొందరు ప్లాంట్ల వద్ద 20 డబ్బాలు నింపుకొని వాటిలో కొన్ని కొళాయి నీళ్లతో నింపి అమ్ముతున్నారు. జిల్లాలో ఇష్టారాజ్యంగా వాటర్‌ప్లాంట్ల నిర్వాహకులు విక్రయాలు సాగిస్తున్నా పట్టించుకునే అధికారులే కరవయ్యారని పలువురు నగర ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి నిబంధనలు పాటించని వాటర్‌ప్లాంట్లపై ప్రత్యేక దృష్టిసారించి ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన అవసరం ఉంది.