S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సమగ్ర సోమశిల లక్ష్యం

అనంతసాగరం, జూలై 28: జిల్లాకు సాగు, తాగునీటి వరప్రసాదిని అయిన సోమశిల జలాశయాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడమే ధ్యేయంగా తాను కృషి చేస్తానని నూతన కలెక్టర్ ముత్యాలరాజు తెలిపారు. గురువారం ఆయన జలాశయాన్ని సందర్శించారు. ప్రాజెక్ట్ చైర్మన్ రాపూరు సుందరరామిరెడ్డి చేతులమీదుగా పుష్పగుచ్ఛాన్ని అందుకున్నారు. అనంతరం జలాశయం వద్ద పరివాహక ప్రాంతాలను పరిశీలించారు. ప్రాజెక్ట్ అధికార్లతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సమగ్ర సోమశిలకు సంబంధించి ప్రతిబంధకంగా ఉన్న అటవీ అనుమతులపై చర్చించారు. ఆయకట్టు విస్తరణకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అంతేగాకుండా సోమశిల జలాశయంలో నీటిమట్టం కొలతల్లో అవకతవకలపై కూడా కలెక్టర్ అధికార్లనుద్దేశించి చురకలు అంటించారు. ఇలాంటి అవకతవకలు మరలా జరగకుండా ప్రాజెక్ట్ అధికారులు పర్యవేక్షణ సజావుగా చేయాలన్నారు. అనంతరం మండలంలోని పల్స్ స్మార్ట్ సర్వే ఎలా జరుగుతోందని ఆర్డీఓ ఎంవి రమణ, తహశీల్దార్ సోమ్లానాయక్‌ను అడిగి తెలుసుకున్నారు. సాగరంలో రెవెన్యూ వ్యవహారాల్లోనూ అక్రమాలు అధికంగా ఉన్నాయంటూ ఈ సందర్భంగా కలెక్టర్ తప్పుబట్టారు. కార్యక్రమంలో సోమశిల ఎస్‌ఇ ఎస్వీరావు, డిఇలు విజయభాస్కరరెడ్డి, బాబు, పెంచలయ్య, వెంకటసుబ్బయ్య, మండల అభివృద్ధి అధికారి ఐజాక్‌ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
సంగం బ్యారేజీని పరిశీలించిన కలెక్టర్
సంగం: సంగం బ్యారేజీ వద్ద జరుగుతున్న పనులను నూతన కలెక్టర్ ముత్యాలరాజు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. బ్యారేజీ వద్ద జరుగుతున్న ర్యాప్ట్ ఫౌండేషన్ పనులను పరిశీలించారు. పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. త్వరితగతిన పూర్తిచేసేందుకు తగు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఆనకట్ట వద్ద ఉన్న కనిగిరి రిజర్వాయర్ ప్రధాన కాలువ, నెల్లూరు కాలువలను పరిశీంచారు. అనంతరం సంగం మండల అధికారులతో ఆత్మగౌరవం కార్యక్రమంపై చర్చించారు. మరుగుదొడ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అన్ని గ్రామాలు గ్రీన్ చానల్ కింద ఏర్పాటుచేసి మరుగుదొడ్ల నిర్మాణాలకు బిల్లులు జాప్యం జరగకుండా చూస్తున్నామన్నారు. ప్రతీ గ్రామం బహిరంగ మలవిసర్జన రహిత గ్రామంగా అయ్యేందుకు అధికారులు గట్టిగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఇ కోటేశ్వరరావు, ఇఇ, ఎఇలు, ఎంపిడిఒ జయరామయ్య, పిఆర్ ఎఇ మల్లికార్జున, సీనియర్ అసిస్టెంట్ అనీల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.