నమో వెంకటేశాయ ఫస్ట్‌లుక్ నేడు
Published Friday, 29 July 2016అక్కినేని నాగార్జున హీరోగా ఓం నమోవెంకటేశాయ పేరుతో ఓ భక్తిరస చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. నాగార్జునతో కలిసి అన్నమయ్య, శ్రీరామదాసు, శిరీడీసాయి లాంటి భక్తిరస చిత్రాలను అందించిన దర్శకుడు కె.రాఘవేంద్రరావు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను ఈనెల 30న విడుదల చేస్తారు. రెండు రోజుల్లో ‘ఓం నమో వెంకటేశాయ’ తొలి దర్శనం (్ఫస్ట్‌లుక్) ఉంటుందని రాఘవేంద్రరావు తెలిపారు. సెట్లో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ, భక్తిశ్రద్ధలతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మనం, సోగ్గాడే చిన్నినాయనా, ఊపిరి సినిమాలతో సత్తా చాటుకున్న నాగార్జునకు ఓం నమో వెంకటేశాయ మరింత ఇమేజ్‌ని పెంచేదిగా నిలుస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. మహేష్‌రెడ్డి నిర్మాణంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అనుష్క, ప్రగ్యా జైస్వాల్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.