S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అహంకార ధోరణి తగదు

గజ్వేల్, జూలై 29: టిఅర్‌ఎస్ ప్రభుత్వ వత్తిడితో పోలీసుల అహంకారపు ధోరణి ఎంత మాత్రం సమంజసంకాదని, కిడ్నాపింగ్ తరహాలో పోలీసుల తీరు ఉన్నట్లు మాజీ మంత్రి, ప్రతిపక్ష నేత జానారెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఉదయం మెదక్ జిల్లా సరిహద్దులో మాజీ మంత్రి షబీర్‌అలితోపాటు తనను పోలీసులు అదుపులోకి తీసుకున్న సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో రాచరిక పాలన తలపిస్తుందని, కాంగ్రెస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్ట్‌ల పేర్లు మార్చి తామే నిర్మిస్తున్నట్లుగా టిఆర్‌ఎస్ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నట్లు విమర్శించారు. కాగా ప్రజలపై అణచివేత చర్యలు ఎంతమాత్రం క్షమించరని, మల్లన్నసాగర్ ముంపు బాధితులను పరామర్శిస్తే సిఎం కెసిఆర్ కొచ్చిన బయం ఏమిటని ఆయన నిలదీశారు. 2013 జిఒ ప్రకారం పరిహారం చెల్లించాలని తాము డిమాండ్ చేస్తుండగా ముంపు బాధితులుసైతం న్యాయమైన పరిహారం కోసం శాంతియుత పథకంలో ఆందోళన చేపడితే పోలీసులతో లాఠీచార్జి, కాల్పులు జరిపించడం సమర్ధనీయం కాదని అన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వ పాలన ఇలాగే కొనసాగితే ప్రజలు ఎంతమాత్రం సహించేస్థితిలో లేరని పేర్కొన్నారు.