S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఫలించని ప్రయత్నాలు...

కరీంనగర్, జూలై 29: ఎమ్సెట్-2 పరీక్షను రద్దు చేయవద్దంటూ మంచి ర్యాంకులు సాధించిన విద్యారులు, వారి తల్లిదండ్రులు రెండ్రోజులుగా ఆందోళనల ద్వారా చేపట్టిన ప్రయత్నాలు ఫలించలేదు. ఎమ్సెట్-2 రద్దుకే ప్రభుత్వం మొగ్గుచూపింది. దీంతో మంచి ర్యాంకుల సాధించిన వారిలో నైరాశ్యం, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. జిల్లాలో ఈ నెల 9న నిర్వహించిన ఎమ్సెట్-2 పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 3,076 మంది విద్యార్థులు హాజరు కాగా, ప్రభుత్వం 13న వాటి ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో ర్యాంకులు సాధించిన విద్యార్థుల సంఖ్య జిల్లాలో వందల్లోనే ఉంది. ఇక సీట్ల కేటాయింపు ప్రక్రియ ప్రారంభమయ్యే సమయానికే ప్రశ్నాపత్రం లీకేజీ వెలుగుచూడటం, సిఐడి విచారణను వేగవంతం చేయడంతో భారీ కుంభకోణం వెలుగుచూసిన సంగతి విధితమే. దీంతో ర్యాంకర్ల ఆనందం ఆవిరైంది. లీకేజీ వెలుగుచూసినప్పటి నుంచి ఎమ్సెట్ -2 రద్దవుతుందని ప్రచారం జరగడంతో ర్యాంకర్లు, వారి తల్లిదండ్రులు పరీక్ష రద్దు చేయవద్దంటూ జిల్లాలో ఆందోళనలు చేపట్టారు. చివరకు హైదరాబాద్ సచివాలయం వద్ద కూడా ఆందోళనకు దిగారు. అయినా, సిఐడి అందించిన నివేదికలు, గతంలో లీకేజీ సంఘటనల్లో తీసుకున్న చర్యలను లోతుగా ఆధ్యయనం చేసిన సిఎం కెసిఆర్ ఎమ్సెట్-2 రద్దుకే నిర్ణయం తీసుకున్నారు. అయితే, ర్యాంకర్లకు పరీక్ష ఫీజులో మినహాయింపు, పరీక్ష రోజున బస్సుల సౌకర్యం కల్పించాలని అధికారులు ఆదేశించారు. అలాగే లీకేజికి పాల్పడిన నిందితులపై కఠినంగా వ్యవహరిచాలని కూడా ఆదేశించారు. ఏదిఎమైనా ఇప్పటికే నీట్, రెండుసార్లు ఎమ్సెట్ రాసిన విద్యార్థులు మరోమారు ఎమ్సెట్ రాయడంపై ఆందోళన చెందుతుండగా, తల్లిదండ్రులు కలవరపడుతున్నారు.