S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్రాజెక్ట్‌లపై ప్రతిపక్షాల రాద్దాంతం వద్దు

మహదేవపూర్, జూలై 29: బీడు భూములను సస్యశ్యామలం చేయడానికే ప్రాజెక్ట్‌లు నిర్మిస్తుంటే వాటిపై ప్రతిపక్షాలు రాద్దాంతం చేయడం తగదని రాష్ట్ర గిరిజన సంక్షేమ, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ అన్నారు. శుక్రవారం మహదేవపూర్ మండలం కేంద్రంలో కోటి రూపాయలతో నిర్మించిన గిరిజన బాలికల పాఠశాల వసతి గృహం, 25లక్షల రూపాయలతో నిర్మించిన గిరిజన సంస్థ గోదాం భవనాన్ని ఆయన ఎమ్మెల్యే పుట్ట మధుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రిని బంజార సంఘం నాయకులు సన్మానించారు. అనంతరం మంత్రి చందూలాల్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపరిచిన హామీల కంటే ఎక్కువ అభివృద్ధి చేస్తోందన్నారు. మారుమూల మండలాలైన మహాముత్తారం, కాటారం, మహదేవపూర్ మండలాల్లో గిరిజనుల అధికంగా ఉన్నారన్నారు. వారంతా గత పాలకుల వివక్షకు గురయ్యారని, తెలంగాణ ఏర్పడిన తరువాత ఈ గిరిజన ప్రాంతంలోనే వంద కోట్ల రూపాయల నిధులతో రోడ్లు, పాఠశాలలు, మంచినీటి సౌకర్యం, పలు అభివృద్ధి పనులు చేపట్టిందని ఆయన వివరించారు. మారుమూల ప్రాంత గిరిజనులను అభివృద్ధిపరిచేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు తెలిపారు. గిరిజనులకు కాటారంలో జూనియర్ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే జిసిసి ద్వారా మహదేవపూర్‌లో పెట్రోల్ బంక్ ఏర్పాటుకు హామీ ఇచ్చారు. 2005లోబడి పోడు భూములు చేసుకున్న వారికి భూములు ఇవ్వాలని, గతంలోనే ఫారెస్ట్ విభాగం అధికారులకు తెలపడం జరిగిందని, అదేవిధంగా వారికి న్యాయం చేస్తానని తెలిపారు. గిరిజన సంస్థ ద్వారా ఎరువులు, విత్తనాలు కూడా సరఫరా చేయడానికి ప్రణాళిక తయారు చేసినట్లు ఆయన తెలిపారు. అనంతరం అంత్య పుష్కరాలకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను మంత్రి చందూలాల్, ఎమ్మెల్యే పుట్ట మధు ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిసిసి ఆర్‌ఎం సీతారాం నాయక్, ఏటూర్‌నాగారం డిఎంఓ సూపరింటెండెంట్ ఉపేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ లింగంపల్లి శ్రీనివాస రావు, జడ్పీటిసి హసీనాభాను, సింగల్ విండో చైర్మన్ శ్రీపతి బాపు, ఎంపిపి వసంతా మోహన్‌రెడ్డి, లంబాడి హక్కుల నాయకులు అజ్మీరా పూల్‌సింగ్, నాయకపోడు నాయకులు పోలం మల్లేష్, కుమార్, కుడిమెట సమ్మయ్య, ఎర్రయ్య, గుర్సింగం బాపు పాల్గొన్నారు.